మరో మాస్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో రామ్ పోతినేని మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఈ సినిమా తరువాత రామ్ పేరుకు ముందు ‘ఉస్తాద్’ అనే పేరొచ్చి చేరింది. రీసెంట్ గా విడుదలైన ‘రెడ్’ సినిమా టైటిల్స్ లో కూడా ఉస్తాద్ రామ్ పోతినేని అనే వేశారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో రామ్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ.. రామ్ మాత్రం కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకుంటున్నాడట.

గతంలో విజయ్, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో ‘జిల్లా’ అనే సినిమాను రూపొందించిన దర్శకుడు ఆర్.టి.నేసన్ మరో సినిమా చేయలేదు. ఇంతకాలానికి రామ్ హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు నేసన్. మాస్ ఎలిమెంట్స్ తో కూడిన యాక్షన్ కథను సిద్ధం చేసుకున్న నేసన్ ఆ కథను రామ్ కి వినిపించాడట. స్టోరీలో ఉన్న మాస్ ఎలిమెంట్స్ రామ్ ని ఆకట్టుకున్నాయట. దీంతో సినిమా చేయడానికి అంగీకరించాడనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే అధికార ప్రకటన రానుందని చెబుతున్నారు.

‘ఇస్మార్ట్ శంకర్’తో తనకొచ్చిన మాస్ ఇమేజ్ ని రామ్ మరింత స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నాడు. అందుకే వరుసగా మాస్ స్టోరీలను ఎన్నుకుంటున్నాడు. ‘రెడ్’లో కూడా ఒక పాత్ర పూర్తిగా మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇప్పుడు దర్శకుడు నేసన్ తీయబోయేది కూడా మాస్ కథే.. దీన్ని బట్టి హీరో రామ్ ఇప్పట్లో మాస్ సినిమాలను విడిచిపెట్టే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus