బాహుబలి సిరీస్ లో శివగామి పాత్ర ద్వారా రమ్యకృష్ణకు పాన్ ఇండియా నటిగా గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే. బాహుబలి2 తర్వాత రమ్యకృష్ణ పారితోషికం కూడా పెరిగింది. రమ్యకృష్ణ రోజుకు పది లక్షల రూపాయల చొప్పున పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి. రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్నా ఆ సినిమాల ద్వారా రమ్యకృష్ణకు సక్సెస్ దక్కడం లేదు.
ప్రస్తుతం రమ్యకృష్ణ బంగార్రాజు సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాతో తనకు సక్సెస్ దక్కుతుందని ఆమె భావిస్తున్నారు. 2022 జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. సంక్రాంతి రేసు నుంచి ఏదైనా పెద్ద సినిమా తప్పుకుంటే బంగార్రాజు సంక్రాంతి రేసులో నిలిచే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. హలో, రిపబ్లిక్, శైలాజారెడ్డి అల్లుడు, రొమాంటిక్, రిపబ్లిక్ సినిమాలలో రమ్యకృష్ణ కీలక పాత్రలలో నటించగా ఆ సినిమాలలో ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా నాగచైతన్య, కృతిశెట్టి ఈ సినిమాలో హీరొహీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రమ్యకృష్ణ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రమ్యకృష్ణ సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా ఆఫర్లు వస్తున్నాయి. సీరియల్స్, రియాలిటీ షో ఆఫర్లతో రమ్యకృష్ణ బిజీగా ఉన్నారు. బంగార్రాజు సినిమాకు భారీస్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం.