Ramya Krishna: బాహుబలి విషయంలో రమ్యకృష్ణ కండిషన్లకు జక్కన్న ఒప్పుకున్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి చెప్పాల్సిన పనిలేదు ఈమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ గాను అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ఇలా ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఈమె వరస సినిమా అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే నేడు రజనీకాంత్ తో నటించినటువంటి జైలర్ సినిమా ద్వారా రమ్యకృష్ణ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హాజరైనటువంటి రమ్యకృష్ణ తన సినిమాల గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రమ్యకృష్ణ బాహుబలి సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు.

బాహుబలి సినిమా తన సెకండ్ ఇన్నింగ్స్ కు ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చిందని ఈమె తెలియజేశారు. ఇక ఇందులో శివగామి పాత్ర తనకు ఎంతో మంచి పేరు సంపాదించిందని తెలిపారు. ఇకపోతే శివగామి పాత్రలో ఈమె నటించడం కోసం ఏకంగా రాజమౌళి గారికి కొన్ని కండిషన్లను పెట్టానని ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు. మాట్లాడుతూ బాహుబలి సినిమాలో నటించాలని నన్ను కోరగా కొన్ని కండిషన్లు పెట్టాను వాటికి ఒప్పుకుంటేనే తాను ఈ సినిమాలో నటిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.

ఈ సినిమా కోసం తాను ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వలేనని కండిషన్ పెట్టారట. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ కోసం తాను పగలు మాత్రమే వస్తానని రాత్రిపూట అసలు హాజరుకాను అంటూ ఈమె రాజమౌళికి కండిషన్స్ పెట్టారని అయితే ఆ కండిషన్లకు రాజమౌళి గారు ఒప్పుకున్నారు అంటూ ఈ సందర్భంగా రమ్యకృష్ణ (Ramya Krishna) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus