శివగామి కోసం కొత్త నటిని వెతుకుతున్నారు!

“బాహుబలి” చిత్రంలో ప్రభాస్, రాణాలు పోషించిన “బాహుబలి, భల్లాలదేవ”ల పాత్రల తర్వాత అందర్నీ అమితంగా ఆకట్టుకొన్న పాత్ర “శివగామి”. ఈ పాత్రలో రమ్యకృష్ణ స్క్రీన్ ప్రెజన్స్, ఆమె పలికించిన రౌద్రం సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాయి. అయితే.. ఇటీవల ఎనౌన్స్ చేసిన “బాహుబలి ప్రీక్వెల్”లో మాత్రం రమ్యకృష్ణ ఉండడం లేదని తెలుస్తోంది. నిజానికి ఈ ప్రీక్వెల్ మొత్తం శివగామి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆనంద్ నీలకంఠ రాసిన “ది రైజ్ ఆఫ్ శివగామి” ఆధారంగా రూపొందనున్న ఈ సిరీస్ ను దేవకట్టా, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయనుండగా.. రాజమౌళి పర్యవేక్షించనున్నారు.

ఆర్కా సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ప్రొడ్యూస్ చేయనున్న ఈ భారీ వెబ్ సిరీస్ లో శివగామి పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటిని తీసుకోనున్నారట. శివగామి చిన్నప్పట్నుంచి బిజ్జలదేవుడ్ని పెళ్లాడే వరకూ ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నారు. అందుకోసం ముగ్గురు నటీమణుల్ని శివగామిగా చూపించనున్నారు. రమ్యకృష్ణ బయట సినిమాలతో బిజీగా ఉండడంతో ఆమె స్థానంలో వేరే నటిని తీసుకోనున్నారు. ఈ వెబ్ సిరీస్ చివర్లో లేదా ప్రమోషన్స్ లో రమ్యకృష్ణ పాల్గొనే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus