Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

గతవారం ‘బాహుబలి’ సినిమా ‘బాహుబలి – ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ అయ్యింది. 10 ఏళ్ళ తర్వాత రీ- రిలీజ్ అయినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది. తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని రీ- రిలీజ్ చేయగా.. అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు సాధించింది. సౌత్ లో రీ- రిలీజ్ అయిన సినిమాల్లో ‘బాహుబలి-ది ఎపిక్’ ఆల్ టైం రికార్డులు సృష్టించింది అనే చెప్పాలి. ఈ క్రమంలో అందరూ బాహుబలితో ఉన్న జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు.

Ramya Krishna

ఈ టైంని క్యాష్ చేసుకోవాలని రామ్ గోపాల్ వర్మ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. విషయం ఏంటంటే.. అతను ‘పోలీస్ స్టేషన్ మైన్ భూత్’ అనే హారర్ మూవీ తీస్తున్నాడు. ఇందులో మనోజ్ బాజ్ బాయ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా రమ్యకృష్ణ అతి కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు కొన్ని పోస్టర్స్ తో రివీల్ చేశాడు వర్మ. ఈ ఫోటోల్లో రమ్యకృష్ణ చూడటానికి చాలా మాస్ గా కనిపిస్తుంది. చేతిలో సిగరెట్, నుదిటిపై ఘాటు.. ఇలా చాలా రఫ్ గా ఉంది. దీంతో చాలా మంది నెటిజెన్లు ‘పోలీస్ స్టేషన్ మైన్ భూత్’ లో రమ్యకృష్ణ దెయ్యం పాత్ర పోషిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కానీ అందులో నిజం లేదు అంటున్నాడు వర్మ. గతంలో ‘పోలీస్ స్టేషన్ మైన్ భూత్’ ఐడియా గురించి వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ఓ డాన్ చనిపోయి.. పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులను చిత్రహింసలు పెట్టడం ఆ సినిమా సారాంశం అని వర్మ చెప్పడం జరిగింది. అందుకే రమ్యకృష్ణ దెయ్యం పాత్ర పోషిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ కాదని వర్మ చెప్పడం గమనార్హం. ప్రస్తుతానికి రమ్యకృష్ణ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటోలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి. ‘శివగామిని ఇలా చేసేశాడేంటి వర్మ’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus