Ramya Krishna: పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రమ్యకృష్ణ!

  • August 31, 2023 / 02:52 PM IST

సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే. ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో కొనసాగినటువంటి వారు రాజకీయాల్లోకి రావడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే నటి రోజా సైతం ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగిన అనంతరం రాజకీయాలలో కూడా రాణిస్తూ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా నటి రమ్యకృష్ణ కూడా రాజకీయాలలోకి రాబోతుంది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. గత కొద్దిరోజుల క్రితం రమ్యకృష్ణ రోజా ఇంటికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

అప్పటినుంచి ఈమె (Ramya Krishna) కూడా రాజకీయాలలోకి రాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రమ్యకృష్ణ తన పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్నటువంటి వార్తల పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ నేను రోజా ఇండస్ట్రీలో చాలా మంచి స్నేహితులమని తెలిపారు. మేమిద్దరం అప్పుడు ఎలాగ ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం అయితే నేను చాలా సంవత్సరాల తర్వాత తిరుపతి వెళ్ళాను.

తిరుపతి వెళ్ళిన నాకు స్వామి దర్శనం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇలా స్వామి దర్శనం మంచిగా జరగడానికి కారణం రోజా అందుకే ఆమెకు కృతజ్ఞతలు తెలపడానికి తన ఇంటికి వెళ్లాను.ఇక అక్కడికి వెళ్లినటువంటి నేను సినిమాల గురించి రాజకీయాల గురించి ఏమాత్రం మాట్లాడుకోలేదు కేవలం పిల్లల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాల గురించి మాత్రమే మాట్లాడుకున్నాము. ఇక ఎవరినో చూసి తాను రాజకీయాలలోకి రావాలని ఎప్పుడూ అనుకోను ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్లే రాజకీయాలలోకి వస్తారు.

ప్రస్తుతం రోజాకు రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉంది. అందుకే తను రాజకీయాలలోకి వచ్చి ఎంతో కష్టపడుతూ ఉన్నత స్థానంలో ఉందని రమ్యకృష్ణ తెలిపారు. నాకైతే ప్రస్తుతం రాజకీయాలలోకి రావాలని ఆసక్తి ఏమాత్రం లేదని భవిష్యత్తులో వస్తే అప్పుడు చెబుతాను అంటూ ఈ సందర్భంగా పొలిటికల్ రమ్యకృష్ణ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus