ఎన్టీఆర్ చిత్రంలో నటించేందుకు సై అన్న రమ్యకృష్ణ!
- December 27, 2016 / 10:42 AM ISTByFilmy Focus
జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తొలిసారి తారక్ నటిస్తున్నఈ మూవీ ని డైరక్టర్ బాబీ సరికొత్తగా తెరకెక్కించేందుకు శ్రమిస్తున్నారు. వంద కోట్లతో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెప్పించనున్నారు. వారి పక్కన ముగ్గురు భామలు నటించనున్నారు. కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్, మంజిమ మోహన్ ల ఎంపిక ఖరారు అయింది.
వీరితో పాటు మరో కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నట్లు తెలిసింది. బాహుబలి లో శివగామిగా కనిపించి రేంజ్ పెంచుకున్న ఒకప్పటి హీరోయిన్ తారక్ సినిమాలో పాత్ర అనగానే వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. ఇదివరకు రమ్యకృష్ణ సింహాద్రి సినిమాలో ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది. అలాగే నా అల్లుడు మూవీలో అత్తగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ 27 ఫిల్మ్ లో అలరించేందుకు సిద్ధమైంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














