పండుగ నాడు సందడి చేయనున్న ఐదు సినిమాలు ఇవే

వేసవి సీజన్ కొన్ని రోజుల్లో ముగియనుంది. బడులు, కాలేజీలు తెరవడంతో థియేటర్లవద్ద సందడి తగ్గిపోనుంది. అయినా సినిమా వాళ్ళు ఎటువంటి బెంగ పెట్టుకోవడం లేదు. తమ సినిమాలతో హంగామా చేయడానికి సిద్ధమవుతున్నారు. రంజాన్ సందర్భంగా ఐదు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ ఏడాది రంజాన్ జూన్ 14 సాయంత్రం ప్రారంభమై జూన్ 15 సాయంత్రం ముగిసే అవకాశం ఉంది.  అందుకే ఈ రెండు రోజుల్లో విడుదల అయ్యేందుకు ఐదు సినిమాలు ఫిక్స్ అయ్యాయి. ప్రతి ఏడాది రంజాన్ కి కచ్చితంగా తన సినిమా రిలీజ్ చేసే సల్మాన్.. ఈసారి  ‘రేస్- 3’ చిత్రంతో వస్తున్నాడు.

ఈ సినిమా జూన్ 15న విడుదల కానుంది. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన “టాక్సీవాలా” కూడా గ్రాఫిక్ వర్క్ పెండింగ్ ఉండడం వల్ల ముందు అనుకున్న మే 18 నుంచి వాయిదా పడి ఇదే రోజున విడుదల కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్దే హీరో హీరోయిన్లుగా నటించిన ‘సాక్ష్యం’ సినిమా ఒకరోజు ముందుగా అంటే జూన్ 14న థియేటర్లోకి రానుంది. ఇక శ్రీనివాస్ రెడ్డి విభిన్న కథతో తెరకెక్కించిన “జంబ లకిడి పంబ”,  ఆండ్రియా- అంజలి నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘తారామణి’ కూడా జూన్ 15న రిలీజ్ కానున్నాయి. తెలుగులో పెద్ద స్టార్ సినిమా ఏది లేకపోవడం వల్ల థియేటర్ల కొరత ఉండదు. సో ఈ ఐదు సినిమాలు మంచిగా కలక్షన్స్ అందుకోనున్నాయి. మరి ఏది హిట్ అవుతుందో అని మాత్రం ఇప్పుడే చెప్పలేము.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus