రానా దగ్గుబాటి హాథీ మేరె సాథీ అనే హిందీ చిత్రాన్ని మొదలుపెట్టి చాల కాలం అవుతుంది. ఐతే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైన తరువాత రానా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడటంతో చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఆయన సుదీర్ఘంగా మూడు నెలల సమయం ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఐతే రానా ఆరోగ్యంపై వచ్చిన వార్తలను కుటుంబ సభ్యులు ఖండించినప్పటికీ ఎవరూ విశ్వసించలేదు. ఇక అమెరికా ట్రిప్ నుండి తిరిగొచ్చిన రానా సన్నగా గుర్తుపట్టలేనంతగా తయారై కనిపించాడు.
అప్పటికే రానా పలు ప్రాజెక్ట్స్ ఒప్పుకొని వున్నారు. తెలుగులో విరాట పర్వం 1992, తమిళంలో ఓ చిత్రం అలాగే హాథీ మేరే సాథీ చిత్రాలు ఆయన పూర్తి చేయాల్సివుంది. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఈ చిత్రాల షూటింగ్స్ లో తిరిగిపాల్గొంటున్నారు. తెలుగులో అరణ్య పేరుతో విడుదల అవుతున్న హాథీ మేరే సాథీ చిత్రం కోసం ఆయన చాలా రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచరస్ మూవీ కావడంతో రిస్కీ స్టంట్స్ ఉంటాయి. ప్రస్తుతం రానా ఆరోగ్య రీత్యా ఇలాంటి స్టంట్స్ రిస్కీ షాట్స్ కస్టమే అని చెప్పాలి. కానీ సినిమా కోసం రానా వెనుకాడకుండా కష్టపడుతున్నాడట. ఇక ఈ చిత్రానికి ప్రభు సోలొమన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 2న తెలుగు, హిందీ మరియు తమిళ భాషలలో విడుదల కానుంది.