Rana: మహేష్ బాబు గురించి రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మహేష్ బాబు  (Mahesh Babu) మేనల్లుడు గల్లా అశోక్ (Ashok Galla)  హీరోగా రూపొందిన రెండో సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’  (Devaki Nandana Vasudeva) ట్రైలర్ లాంచ్ వేడుక ఈరోజు ఘనంగా జరిగింది. దీనికి హీరోలు రానా, సందీప్ కిషన్..లు ముఖ్య అతిధులుగా విచ్చేసి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అర్జున్ జంధ్యాల (Arun Jandyala) డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ అందించడం జరిగింది. మైథలాజికల్ టచ్ తో రూపొందిన మాస్ మూవీ ఇది. ఇక ఈ వేడుకలో రానా (Rana Daggubati) స్పీచ్ హైలెట్ అయ్యింది.

Rana

అతను మహేష్ బాబు గురించి చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రానా మాట్లాడుతూ… ” నాకు కృష్ణతత్వం ఏంటో నేర్పించింది రచయిత బుర్రా సాయి మాధవ్ (Sai Madhav Burra) గారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ (Krishnam Vande Jagadgurum)  టైంలో ఆయన చెప్పిన ‘దేవుడంటే సాయం’ అనే మాట నా జీవితాన్ని మార్చేసింది. ఎవరికైనా సరే నా వంతు సాయం నేను చేయాలని డిసైడ్ అయ్యాను. చాలా రోజుల తర్వాత ఒక తెలుగమ్మాయిని హీరోయిన్ గా చూడటం ఆనందంగా ఉంది.

మహేష్ బాబుకు నేను 20 ఏళ్ల నుండి ఫ్రెండ్.. అయితే జయదేవ్ గల్లా గారికి నేను 25 ఏళ్ల నుండి ఫ్రెండ్. మహేష్ బాబు డిసిప్లేన్ & సిన్సియారిటీ అలాగే జయదేవ్ గల్లా గారి విజన్ ఉంటే చాలు అశోక్ నీకు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రానా కామెంట్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు అంటే రానాకి ప్రత్యేకమైన అభిమానం ఉంది.

గతంలో ‘భలే మంచి రోజు’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ కాళ్లకు నమస్కారం చేసిన పిక్ ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈరోజు మరోసారి మహేష్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు రానా. ఇక రానా స్పీచ్ కి సంబంధించిన వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి :

 ‘మిస్టర్‌ బచ్చన్‌’..ఇప్పుడు ప్రొడ్యూసరే వరస్ట్ అన్నారు..రియాక్ట్‌ అవుతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus