Rana: అందరికీ అన్ని సినిమాలు నచ్చాలని రూల్ లేదు: రానా

సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు వారి నటనకు గాను గౌరవాన్ని ఇస్తూ ఎన్నో అవార్డులను ప్రకటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నో రకాల అవార్డుల ద్వారా సెలబ్రిటీలను ఘనంగా సత్కరిస్తున్నారు.ఈ క్రమంలోనే 69వ జాతీయ అవార్డులను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులలో భాగంగా నటుడు అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. దీంతో ఎంతో మంది ఈయనకు శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

తమకు అవార్డుల కన్నా అభిమానుల ఆదరణ ముఖ్యమని మరికొందరు అవార్డులు ఎలాంటి గుర్తింపును తీసుకురావు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే నాచురల్ స్టార్ నాని సైతం ఈ అవార్డుల గురించి చేసినటువంటి ట్వీట్ వివాదాస్పదంగా మారింది. నేషనల్ అవార్డ్స్ గురించి నాని స్పందిస్తూ.. సూర్య నటించిన జై భీమ్ వంటి సినిమాకు నేషనల్ అవార్డు రాకపోవడం ఎంతో బాధాకరం అంటూ ట్వీట్ చేశారు. ఈ విధంగా నాని చేసినటువంటి ఈ ట్వీట్ కూడా వివాదాస్పదంగా మారింది.

అయితే ఇలా నేషనల్ అవార్డ్స్ గురించి వస్తున్నటువంటి ఈ విమర్శలపై తాజాగా (Rana) రానా దగ్గుబాటి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఈ అవార్డుల గురించి మాట్లాడుతూ.. నేషనల్ అవార్డులపై ఎలాంటి కాంట్రవర్సీలు లేవని తెలిపారు. సినిమాల విషయంలో ప్రతి ఒక్కరిది ఒక్కోరకమైన అభిరుచి, అభిప్రాయాలు ఉంటాయని ఈయన తెలిపారు. ఇక ప్రతి ఒక్క హీరో హీరోయిన్ నటించే సినిమా అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు ఇక్కడ ఎవరి ఇష్టం వారిది.

ఫలానా కథకు అవార్డులు రావాలని చాలా మంది అనుకున్నారు. కానీ రాలేదు. అంతే కానీ బన్నీకి ఎందుకొచ్చిందన్నది కాదని రానా తెలిపాడు. ఆ ఉద్దేశంతో హీరోలు ఎవరూ కూడా పోస్టులు పెట్టరు అంటూ ఈయన పరోక్షంగా నానికి మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ఇక సెలబ్రిటీలు ఎవరు కూడా ఇలాంటి కాంట్రవర్సీలు అయ్యేలా పోస్ట్ లు చేయరని మీడియా వారే ఇలాంటి కాంట్రవర్సీలకు కారణం అవుతారు అంటూ ఈయన మీడియాపై సెటైర్స్ వేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus