‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ కి ధీటైన విలన్ గా రానా దగ్గుబాటి నటించాడు.’ ‘రావణాసురుడు’ లేకపోతే ‘రామాయణం’ లేదు అలాగే ‘భల్లాల దేవుడు’ లేకపోతే ‘బాహుబలి’ లేదు ‘ అంటూ రాజమౌళి చాలా సార్లు ఆ పాత్ర గురించి, రానా గురించి చాలా గొప్పగా చెప్పాడు. దానికి కారణం కూడా లేకపోలేదు. ‘బాహుబలి’ చిత్రీకరణ దశలో ఉన్నప్పటి నుండి రానా.. ఈ సినిమా గురించి అక్కడ ఎక్కువగా ప్రమోట్ చేసేవాడు.
‘టాలీవుడ్లో ఓ అద్భుతం జరగబోతుంది’ అంటూ రానా ‘బాహుబలి’ ని ప్రమోట్ చేసి కరణ్ జోహార్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ కి ‘నార్త్ లో బాహుబలి ని రిలీజ్ చేయాలి’ అనే ఆలోచన కలిగేలా ప్రేరేపించాడు. హిందీ మార్కెట్ లో బాహుబలి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రానా హిందీ సినిమాల్లో నటిస్తున్న టైంలో ‘బాహుబలి’ కి అక్కడ మార్కెట్ ఏర్పడేలా చేశాడు అన్నది అక్షర సత్యం.
సరిగ్గా ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కె’ విషయంలో కూడా రానా ఇలాగే సపోర్ట్ చేస్తున్నాడు. ‘బాహుబలి’ అంటే రానా నటించిన సినిమా. కానీ ‘ప్రాజెక్ట్ కె’ ని రానా అంత ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది అనే డౌట్ అందరికీ రావచ్చు. ఇందులో రానా స్వార్థం ఏమీ లేదు. ‘బాహుబలి’ తో తెలుగు సినిమా గొప్పతనాన్ని హిందీ ఫిలిం మేకర్స్ కి వివరించాడు. అతను ఆ సినిమాలో నటించకపోయినా.. ‘బాహుబలి’ వంటి గొప్ప ప్రయత్నానికి తన వంతు సాయం చేస్తాను అని రానా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
‘ప్రాజెక్ట్ కె’ (Kalki) విషయంలో కూడా రానా అదే విధంగా ఆలోచిస్తున్నాడు. తెలుగు సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ చేయాలి, ఇది చాలా గొప్ప సినిమా అనేది రానా ఆలోచన. పైగా దర్శకుడు నాగ్ అశ్విన్.. రానాకి బెస్ట్ ఫ్రెండ్. ఇక ప్రభాస్ – రానా ల ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా సక్సెస్ అయితే రానాకి కూడా క్రెడిట్ దక్కుతుంది.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు