రానాలో మంచి నటుడు, వ్యాఖ్యాత ఉన్నాడనే విషయం తెలిసిందే. అయితే అంతకుమించి ఓ మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అందుకే సినిమా సంబంధిత వ్యాపారాల్లో రానా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. ఓటీటీలఅంటే తెలుగులో అంతగా ఆదరణలో లేని సమయంలో viu అనే ఓటీటీతో టై అప్ అయ్యి… ఓ టాక్ షో చేశాడు. ఆ తర్వాత కూడా ఇలాంటివి కంటిన్యూ చేశాడు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ లాంటి అగ్ర ఓటీటీతో టైప్ అవుతున్నారట.
నెట్‌ఫ్లిక్స్, సురేశ్‌ప్రొడక్షన్స్ కలసి తెలుగులో వెబ్ షోలు, వెబ్‌ఫిల్మ్స్ రూపొందించాలని నిర్ణయించారట. ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య డీల్ కుదిరిందని తెలుస్తోంది. మన దేశంలో ఓటీటీల పోటీలో నిలదొక్కుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ఇటీవల తెలుగు బేస్డ్ కంటెంట్‌ను పెంచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే సురేశ్ ప్రొడక్షన్స్‌తో టైఅప్ అవుతోంది. సురేశ్‌బాబు దగ్గర రైటింగ్, డైరక్షన్ కోసం ఓ కోర్ టీమ్ ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ డీల్‌లో భాగ కాకపోయినా…
రానా నటించిన సినిమాలు నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కాబోతున్నాయని టాక్. ఆ మాటకొస్తే… సురేశ్ బాబు ప్రొడ్యూస్ సినిమాలు కొన్ని వెళ్తున్నాయట. తొలుత ‘విరాటపర్వం’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్స్ వేశారట. త్వరలో ఈ డీల్ విషయంలో, సినిమాల విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. అయితే సురేశ్ ప్రొడక్షన్స్ బిజినెస్ ప్లానింగ్ ఒక్క నెట్‌ఫ్లిక్స్‌తో మాత్రమే కాకుండా… మిగిలిన ఓటీటీలతో కూడా ఉంటుందని టాక్.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!