Chiranjeevi, Rana: రజినీకాంత్ తో పాటు చిరు సినిమాని కూడా ఓకే చేశాడా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.ఈరోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా కె రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు.వివి వినాయక్, మారుతి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించబోతున్నాడు.

చాలా కాలం తర్వాత చిరంజీవి – కీరవాణి కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ ఇది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో విలన్ పాత్ర కూడా ఎంతో కీలకమైనది అని తెలుస్తుంది. ఆ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేసుకుంటుంది చిత్ర బృందం అనే టాక్ కూడా నడుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో విలన్ గా రానా కనిపించబోతున్నాడు అని సమాచారం. ఈ మధ్యనే దర్శకుడు వశిష్ట.. విలన్ పాత్ర కోసం రానాని సంప్రదించగా, రానా ఓకే చెప్పడం జరిగింది అని తెలుస్తుంది.

తనకు పాత్ర నచ్చితే (Rana) రానా.. విలన్ గా నటించడానికి సందేహించడు. అందులోనూ రాంచరణ్ కి రానా బెస్ట్ ఫ్రెండ్. తన చిన్నప్పటి నుండి రానా ఎక్కువగా చిరంజీవి ఇంట్లోనే పెరిగాడు. దీంతో ఈ ప్రాజెక్టులో నటించడానికి రానా ఎస్ చెప్పవచ్చు. కానీ మరోపక్క అతను రజినీకాంత్ హీరోగా జై భీమ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న మూవీలో కూడా నటిస్తున్నాడు. మరి ఒకేసారి 2 పెద్ద ప్రాజెక్టుల్లో అతను నటించగలడా? అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus