Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » రానా గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

రానా గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

  • December 14, 2016 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రానా గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

మూవీ మొఘల్ రామానాయుడు మనవడిగా చిత్ర సీమలోకి అడుగు పెట్టినా, తనకంటూ సొంత పేరుని సాధించడానికి రానా చాలా శ్రమించారు. తండ్రి సురేష్ బాబు, బాబాయ్ వెంకటేష్ తన వెనుక ఉన్నప్పటికీ వారి పేరు ఉపయోగించుకోకుండా గుర్తింపును తెచ్చుకున్నారు. అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న విలన్ లాంటి హీరో జీవితంలోని కొన్ని రహస్యాలు..

1 . యాక్టర్ కంటే ముందు బాస్Rana Daggubatiనటనలోకి రాక ముందే రానా బిజినెస్ లో అడుగు పెట్టారు. స్పిరిట్ మీడియా అనే కంపెనీ స్థాపించి 85 సినిమాలకు వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసారు. కంపెనీ లాభాల్లో ఉన్నప్పటికీ నటనపై ఉన్న ఆసక్తితో దానిని అమ్మేసి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

2 . నిర్మాతగా అవార్డులుRana Daggubatiతాత, తండ్రి తరహాలో పాతికేళ్లకే రానా నిర్మాతగా మారారు. బొమ్మలాట(2004 ) అనే మూవీని ప్రొడ్యూస్ చేసి జాతీయ అవార్డు అందుకున్నారు. మహేష్ సైనికుడు చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ కోఆర్డినేటర్ గా చేసి నంది అవార్డు సాధించారు.

3 . అనుకోకుండా పుస్తకాలపై ప్రేమRana Daggubatiరానా లో ఎవరికీ తెలియని యాంగిల్ పుస్తకాల ప్రేమికుడు. తీరిక దొరికితే బుక్స్ చదువుతుంటారు. పుస్తకాలపై ప్రేమ అనుకోకుండా కలిగిందట. స్కూల్ డేస్ లో రానా బూతు పుస్తకం చదువుతుంటే టీచర్ కి దొరికి పోయారు. అప్పుడు ప్రిన్స్ పాల్ పుస్తకాలు చదవడం ఇష్టం అయితే.. ఇది చదువు అని “ద గాడ్ ఫాదర్” బుక్ ఇచ్చారంట. అది చదివిన తర్వాత పుస్తకాల పురుగు అయిపోయారు.

4 . ఫుడీRana Daggubatiసినీ పరిశ్రమలో ఉండేవారికి ఎంత తినాలని ఉన్నా చాలా కంట్రోల్ చేసుకుంటారు. రానా మాత్రం అవేమి పట్టించుకోరు. చిన్నప్పటినుంచి ఇప్పటివరకు ఆహరం విషయంలో కంట్రోల్ చేసుకోలేదు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిరోజుల క్రితమే ఫుడ్ టూర్ కి వెళ్లి వచ్చారు. అందుకే టాలీవుడ్ లో ఫుడీ అవార్డు ఇవ్వాలంటే రానా పేరు పరిశీలించాల్సిందే.

5 . క్రీడల్లో ప్రావీణ్యంRana Daggubatiరానా కి ఆటలంటే ఇష్టం. చిన్నప్పుడు బాక్సింగ్ బాగా ఆడేవారు, ఓ సారి ముక్కు ఎముక విరగడంతో అటు వైపు వెళ్లలేదు. తర్వాత ఎతుల్లోంచి నీళ్ళల్లో దూకడం హాబీగా చేసుకున్నారు. చాలా లోతున్న నదుల్లో కూడా ఈజీగా అడుగుకు వెళ్లి రాగలరు. ఇప్పుడు కబడ్డీని ప్రోత్సహించే పనిలో పడ్డారు.

6 . తెలుగు పై పట్టుRana Daggubatiరానా ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నప్పటికీ తెలుగుపై పట్టు రావాలని ప్రత్యేకంగా ట్యూషన్ పెట్టుకున్నారు. ఇంటర్ లో కూడా సెకండ్ ల్యాంగ్వేజ్ తెలుగు తీసుకున్నారు. మీరు ఆశ్చర్య పోయే విషయం ఏమిటంటే తెలుగులో క్లాస్ టాప్ స్కోర్ రానాదే.

7 . బేస్ వాయిస్Rana Daggubatiకొన్ని ప్రత్యేక డైలాగులు చెప్పాలంటే బేస్ వాయిస్ అవసరం. అంతేకాదు అంతే డిక్షన్ తో చెప్పగలగాలి. ఆ ప్రతిభను గుర్తించే రాజమౌళి భల్లాల దేవా క్యారెక్టర్ ని అతనికి ఇచ్చారు. దర్శకధీరుడు పెట్టుకున్న అంచనాలకు మించి రానా డైలాగ్ చెప్పి శెభాష్ అనిపించుకున్నారు.

8 . పర్ఫెక్ట్ ఫిట్Rana Daggubatiలీడర్, బాహుబలి సినిమాల్లో రానా లుక్ ని గమనిస్తే చాలా తేడా కనిపిస్తుంది. తొలి చిత్రంలో సన్నగా కనిపించిన రానా భల్లాల దేవా గా పూర్తి ఫిట్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అతను బాడీని మలుచుకున్న తీరు యువతకి స్ఫూర్తి నిచ్చింది. భారీగా తినడమే కాదు.. అందుకు తగ్గట్టుగా జిమ్ ల్లో ఎక్కువ సమయం చెమటని చిందించేవారు.

9 . ఆది నుంచే ప్రయోగాలుRana Daggubatiచిత్రసీమలో హీరోగా నిలదొక్కుకున్నప్పుడు ప్రయోగ చిత్రాలు చేయడం ఆనవాయితీ. రానా మాత్రం ఆది నుంచే కొత్త కథలను ఎంచుకోవడం ప్రారంభించారు. ఫలితాలు నిరాశ పరిచినా తన ప్రయోగ తత్వాన్ని మార్చుకోలేదు. ఆ విషయం అతను చేసిన లీడర్, నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుమ్ , రుద్రమదేవి, ఘాజి సినిమా కథలను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది.

10 . ఆదుకునే మనస్తత్వంRana Daggubatiరానాని చాలా మంది కొబ్బరి కాయతో పోలుస్తుంటారు. టెంకాయ కి ఆయనకి లింకేమిటని అయోమయంలో పడకండి. కోకోనట్ బయట స్ట్రాంగ్ గా లోపల మెత్తగా ఉంటుంది. రానా కూడా అంతే. చూసేందుకు గంభీరంగా ఉంటారు. మనసు మాత్రం వెన్న. కష్టాలను చూస్తే ఇట్టే కరిగిపోతారు. వైజాక్, చెన్నై, హైదరాబాద్ లో వరదలు ముంచెత్తినప్పుడు రానా చాలా హెల్ప్ చేశారు. అనేక సహాయక చర్యలో పాల్గొని మంచి మనసును చాటుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghazi Movie
  • #Krishnam Vande Jagadgurum Movie
  • #Leader Movie
  • #Rana
  • #Rana Body

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

4 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

4 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

7 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

10 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

13 hours ago

latest news

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

1 hour ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

3 hours ago
Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Akhanda 2: ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

4 hours ago
Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

4 hours ago
Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version