‘అయ్యప్పనుమ్ కొషియమ్’… మలయాళంలో పేరు మోసిన మల్టీస్టారర్. అలాంటి సినిమా తెలుగులోకి వస్తోంది అంటే… మన ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, పేరేం పెడతారు అంటూ లెక్కలేసుకున్నారు. హీరోల విషయంలో ఆ పేరు, ఈ పేరు వినిపించి ఆఖరికి పవన్ కల్యాణ్ పేరు ఖరారైంది. రెండో హీరో(?)గా రానాను ఓకే చేశారు. దీంతో కాంబినేషన్ అదిరిపోతుంది అని అందరూ అనుకున్నారు. ఆ విషయం పక్కనపెడితే టైటిల్ చర్చ చాలా రోజులుగా సాగుతుంది. అయితే ఆ చర్చ కాస్త… అసలు ఈ సినిమా ‘మల్టీస్టారర్’ఏనా అనేలా మారిపోయింది.
‘అయ్యప్పనుమ్ కొషియమ్’… పేరులో ఇద్దరు హీరోలను కలిపి ఉంచారు. దీంతో తెలుగు రీమేక్‌లోనూ అలాంటి పనే చేస్తారు అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో ‘బిల్లా రంగా’, ‘బలరామకృష్ణులు’ లాంటి పేర్లు వినిపించాయి. అయితే పవన్ పాత్ర పేరును ‘భీమ్లా నాయక్’ అని పెట్టడం, దానిని హైలైట్ చేస్తూ ఆ మధ్య వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేయడంతో జనాల్లో డౌట్ మొదలైంది. అది ఈ రోజుకో క్లారిటీ ఇచ్చేశారు. సినిమా పేరు ‘భీమ్లా నాయక్’ అని చెప్పేశారు. దీంతో ఈ సినిమాలో రానా పాత్రను తొక్కేశారా అనే చర్చ మొదలైంది. సినిమా ఇద్దరు వ్యక్తుల మధ్య ఈగోల మధ్య సాగుతుంది. కాబట్టి ఇద్దరి పేరు ఉంటే బాగుండు అని అందరూ అనుకున్నారు.
అయితే దర్శకనిర్మాతరచయితలు వేరేగా అనుకున్నట్లు సినిమా టైటిల్ ప్రకటనతో అర్థమైపోయింది. సినిమాలో పవన్‌ను మాత్రమే హైలైట్ చేయాలని చూస్తున్నారని టైటిల్ చూడగానే ఎవరైనా చెప్పేస్తారు. ఇంకా చెప్పాలంటే కనీసం టైటిల్ చెబుతూ విడుదల చేసిన వీడియోలో రానా ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించలేదు. అసలు ఈ సినిమాలో రానా ఉన్నాడా? లేడా? అనే అనుమానం వచ్చేలా ఆ పాత్రను కనిపించకుండా చేసేశారు. కాబట్టి ఈ సినిమాను మల్టీస్టారర్ అని అనలేం ఏమో.
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!