Rana Daggubati: ఆ సినిమాలపై రానాకు ఆసక్తి లేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న అతికొద్దిమంది హీరోలలో రానా ఒకరనే సంగతి తెలిసిందే. లీడర్ సినిమాతో రానా హీరోగా కెరీర్ ను మొదలుపెట్టగా నేనే రాజు నేనే మంత్రి మినహా రానా కెరీర్ లో సోలో హీరోగా సక్సెస్ లేదు. బాహుబలి సిరీస్ రానా కెరీర్ కు ప్లస్ అయినా ఆ సినిమా తర్వాత రానా ఎంచుకున్న సినిమాలు సక్సెస్ సాధించకపోవడం రానా కెరీర్ కు మైనస్ గా మారింది.

రానా నటించిన విరాటపర్వం సినిమా థియేటర్లలో రిలీజవుతుందో ఓటీటీలో రిలీజవుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం రానా పవన్ కళ్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నారు. రానా ఇకపై మల్టీస్టారర్ సినిమాలపైనే దృష్టి పెట్టనున్నారని సోలో సినిమాలపై రానాకు పెద్దగా ఆసక్తి లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాగర్ కె చంద్ర భీమ్లా నాయక్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ ఈ సినిమాకు కథనం, మాటలు అందిస్తున్నారు.

ఇకపై రానా ప్రయోగాలకు దూరం కానున్నారని మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. రానా వెంకటేష్ తో కలిసి నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్కినేని నాగచైతన్యతో కలిసి సినిమా చేయడానికి కూడా రానా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది రానా హీరోగా నటించి విడుదలైన అరణ్య ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ వల్లే రానా మారారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus