సమంత షోలో ఏడ్చేసిన రానా!

టాలీవుడ్ స్టార్ హీరో రానా ఆరోగ్యానికి సంబంధించిన గత కొంతకాలంగా రకరకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రానాకి కిడ్నీ సమస్య ఉందని.. దానికోసమే ఆయన విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాలపై రానా ఎప్పుడూ స్పందించలేదు. అయితే ఆయన నటించిన ‘అరణ్య’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సమయంలో.. ఈ సినిమా కోసం రానా బరువు తగ్గించుకున్నారేమోనని అంతా అనుకున్నారు. కానీ రానా తన ఆరోగ్యంపై స్పందించి ఓ చేదు వార్త చెప్పాడు. నటి సమంత ఆహా యాప్ లో ‘సామ్ జామ్’ అనే షోని హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ షోకి సెలబ్రిటీలను తీసుకొచ్చి వారితో రకరకాల టాస్క్ లు చేయిస్తూ ఉంటుంది. తాజాగా ఈ షోకి రానా, దర్శకుడు నాగ్ అశ్విన్ కలిసి వచ్చారు. ఈ సందర్భంగా రానా తన ఆరోగ్యంపై స్పందించాడు. జీవితం వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో సడెన్ గా చిన్న పాజ్ బటన్ వచ్చిందని.. పుట్టినప్పటి నుండి తనకు బీపీ ఉందని.. దీనివలన గుండెకి సమస్య తలెత్తిందని రానా అన్నారు. ఈ క్రమంలో తన కిడ్నీలు పాడవుతాయని.. స్ట్రోక్ హెమరేజ్ కి 70 శాతం, మరణానికి 30 శాతం ఛాన్స్ ఉందని.. డాక్టర్లు చెప్పిన షాకింగ్ విషయాన్ని రానా చెప్పారు. ఈ విషయం చెప్పిన సమయంలో రానా కంటతడి పెట్టుకున్నాడు.

వెంటనే సమంత స్పందిస్తూ.. ‘మీ చుట్టూ జనాలు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా.. మీరు మాత్రం ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఆ సమయంలో నేను మిమ్మల్ని చూశాను.. మీరు నిజంగా సూపర్ హీరో’ అంటూ రానాని కూల్ చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం రానా తన సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అలానే ఓ షో చేయడానికి సిద్ధమవుతున్నాడు.


మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus