మళ్ళీ అలాంటి ‘డేరింగ్ స్టెప్పే’ తీసుకున్నాడట ..!

  • November 3, 2019 / 05:33 PM IST

సాధారణంగా సినిమాల్లో హీరో చనిపోతే.. తెలుగు ప్రేక్షకులు అంతగా సినిమాని ఆదరించరు అనే కామెంట్ ఎప్పటి నుండో ఉంది. అలాంటి ట్రాజెడీ తో నిండిన క్లయిమాక్స్ కు మన హీరోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. అయితే అటువంటి నెగిటివ్ క్లయిమాక్స్ కు కూడా ఓకే చెప్పి ముందుకు వచ్చి దైర్యంగా సినిమా చేసిన హీరో ఎవరైనా ఉంటే అది రానా అనే చెప్పాలి. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో అసెంబ్లీ ని బాంబు పెట్టి పేల్చేసి.. ఉరికంబానికి ఎక్కుతాడు రానా. అయితే గతాన్ని పరిశీలిస్తే.. ‘బాబీ’ లో మహేష్… ‘చక్రం’ లో ప్రభాస్ … ‘భీమిలి కబడ్డీ జట్టు’ లో నాని… ‘వేదం’ లో అల్లు అర్జున్.. వంటి వారు ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. కానీ అవి సక్సెస్ కాలేదు. అయితే రానా మాత్రం అలాంటి క్లయిమాక్స్ ఉన్నప్పటికీ ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో సక్సెస్ సాధించాడు.

ఇక అలా ఇలాంటి నెగిటివ్ క్లయిమాక్స్ ను చాలా మంది హీరోలు ఓకే చేసేస్తున్నారు. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో కార్తికేయ, ‘జెర్సీ’ లో నాని, ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమలో మెగాస్టార్ చిరంజీవి… ఇలా క్లయిమాక్స్ లో హీరో చనిపోతాడు అని తెలిసినా ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు… అంటే రానా సెట్ చేసిన ట్రెండ్ అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాలో కూడా ఇలాంటి క్లయిమాక్స్ కు ఓకే చెప్పాడట. స్కూల్ టీచర్ అయిన రానా.. తన ప్రియురాలు.. అలాగే నక్సలైట్ అయిన హీరోయిన్ సాయి పల్లవి ని చంపేసి ఆ తరువాత.. తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయే పాత్రలో రానా కనిపిస్తాడని తెలుస్తుంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus