అరణ్యలో రానాకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ!

బాహుబలి సినిమాతో ప్రభాస్ తో పాటు, రానాకీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అందుకే వారు నటించే సినిమాలు ఒకేకాలంలో మూడు భాషల్లో తెరకెక్కుతున్నాయి. అందుకు అనుగుణంగానే వారి పక్కన బాలీవుడ్ బ్యూటీలను సెలక్ట్ చేస్తున్నారు. సాహోలో ప్రభాస్ పక్కన శ్రద్ధ కపూర్ నటిస్తుండగా.. రానా చేస్తున్న తాజాజా చిత్రంలోనూ బాలీవుడ్ హాట్ బ్యూటీ ని ఒకే చేశారు. నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానా  ప్రముఖ దర్శకుడు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అరణ్య’ అనే పేరును ఖరారు చేశారు.

హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ పేరుతో.. తమిళ్‌లో ‘కాదన్’ అనే పేరుతో ఈ చిత్రాన్ని మూడు భాషల్లో రూపొందిస్తున్నారు. అడవుల్లో పెరిగిన ఓ వ్యక్తికి.. ఏనుగులకు ఉన్న అనుబంధాన్ని తెరపై చూపించబోతున్నారు. ఈ చిత్రంలో రానా గెటప్ చాలా వైవిధ్యంగా ఉండబోతుంది. ఈ చిత్రంలో రానాకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్ ని తీసుకున్నారు. “తమిళనాడుకు చెందిన యువతిగా కల్కి కనిపిస్తుంది. ఆమె పాత్ర ఆకట్టుకునేలా ఉంటుంది. ఆమె ఈ సినిమాలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని  ప్రభు అన్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ .. రానా కంటికి ఆపరేషన్ కారణంగా బ్రేక్ ఇచ్చారు.  నెక్స్ట్ షెడ్యూల్ ఆగష్టు నుంచి మొదలుకానుంది. ఇందులో రానాతో పాటు కల్కి పాల్గొననుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus