Rana, Miheeka: సినీ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మిహీకా!

ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి వారిలో రానా దగ్గుబాటి ఒకరు. లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో హీరోగాను విలన్ గాను నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమాతో ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక సినిమాలు మాత్రమే కాకుండా రానా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు.

ఇలా కెరియర్ పరంగా రానా ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే 2020వ సంవత్సరంలో తాను ప్రేమించిన అమ్మాయి మిహీకా బజాజ్ అనే అమ్మాయిని కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేస్తున్నారు. ఇక వీరి తర్వాత ఈ దంపతులు ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వీరి గురించి తరచూ ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇలా రానా దంపతుల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.ఇలా వీరి గురించి ఎన్నో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మిహీక ఈ వార్తలను ఖండిస్తూ వస్తున్నారు.అయితే తాజాగా ప్రెగ్నెంట్ అనే రూమర్లు రావడంతో తాను సంతోషంగా ఉండటం వల్ల బొద్దుగా తయారయ్యానని తాను ప్రెగ్నెంట్ కాదు అనే విషయాన్ని తెలిపారు.

నా నుంచి సర్ప్రైజ్ రాబోతుందని రానా ఎందుకు చెప్పారో (Miheeka) తనకే తెలియాలి అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. పెళ్లికి ముందే ఆమెకు డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియో అనే ఇంటీరియర్ డెకరేషన్ కంపెనీ ఉంది. మిహీకా ఏమాత్రం సినీరంగానికి సంబంధం లేని వ్యక్తి. అయితే తాను సినిమాలలోకి రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై స్పందించిన మిహీక తాను ఇండస్ట్రీలోకి వచ్చే ప్రసక్తే లేదని తన బిజినెస్ తోనే తనకు సమయం సరిపోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus