Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు
- February 11, 2026 / 01:06 PM ISTByPhani Kumar
కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన టైమ్ ట్రావెల్, ఛారిత్రాత్మక చిత్రం ‘బింబిసార’తో స్ట్రాంగ్ డెబ్యూ ఇచ్చాడు దర్శకుడు మల్లిడి వశిష్ట్. ఆ వెంటనే.. మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర'(Vishwambhara) అనే భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ సినిమా చేసే అవకాశం పొందాడు. 2025 జనవరి 10న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని ప్రకటించారు. కానీ ‘గేమ్ ఛేంజర్’ కోసం వాయిదా వేసినట్టు తెలిపారు. కానీ తర్వాత వీఎఫ్సమస్యలు అంటూ తోసిపుచ్చారు.
Vishwambhara
ఆ తర్వాత ప్రారంభమయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ రిలీజ్ అయిపోయింది కానీ ‘విశ్వంభర’ రిలీజ్ కాలేదు.క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదు అనే భావనతో ఈ సినిమాని 2026 సమ్మర్ కి వాయిదా వేసినట్టు చిరు తెలిపారు. కానీ ఆ టైమ్లో కూడా ‘విశ్వంభర’ రిలీజ్ కావడం కష్టంగానే కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు వశిష్ట్ కెరీర్ అయోమయంలో పడింది. చిరు సినిమా కోసం ‘బింబిసార 2’ వదులుకున్నాడు.

అలాగే మధ్యలో రజినీకాంత్ ని కలిసి ఓ కథ వినిపించాడు. అది వర్కౌట్ అవ్వలేదు.ఫైనల్ గా రవితేజకి కథ చెప్పి ఓ ప్రాజెక్టు ఓకే చేయించుకున్నప్పటికీ దానిని నిర్మించడానికి నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో రవితేజ కూడా ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టి.. శివ నిర్వాణ సినిమాకి షిఫ్ట్ అయిపోయాడు. ఇలా చేసిన సినిమా రిలీజ్ కాక, కొత్త సినిమా సెట్ అవ్వక కన్ఫ్యూజన్లో ఉన్నాడు వశిష్ట్.
‘విశ్వంభర’ రిలీజ్ అయ్యి హిట్ అయితేనే ఇతనికి స్టార్ హీరో దొరికే ఛాన్స్ ఉంటుంది.లేదు అంటే మళ్ళీ కళ్యాణ్ రామ్ రేంజ్ హీరో దగ్గరకి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతనికైతే అతను మరో 2 స్క్రిప్ట్స్ డెవలప్ చేసుకుంటూ.. ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడు.
‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్
















