రానా, రెజీనా జంటగా సత్య శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘1945’.’కె.ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్.ఎన్.రాజ రాజన్, సి.కళ్యాణ్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ నిజానికి 4ఏళ్ళ క్రితం మొదలైంది. కానీ అనేక కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. మొత్తానికి ఆ అడ్డంకుల్ని అన్నిటినీ తొలగించుకుని జనవరి 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది. నాజర్, సత్యరాజ్, సప్తగిరి వంటి వారు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు.
విడుదలకి ముందు నుండీ ఈ చిత్రానికి ప్రమోషన్లు వంటివి పెద్దగా చేయలేదు కాబట్టి.. బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. వాటి వివరాల్ని గమనిస్తే :
నైజాం | 0.45 cr |
సీడెడ్ | 0.18 cr |
ఆంధ్రా(టోటల్) | 0.46 cr |
ఏపి+తెలంగాణ (టోటల్) | 1.09 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.12 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 1.21 cr |
‘1945’ చిత్రాన్ని నిర్మాత సి.కళ్యాణ్ చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కు రూ.1.25 కోట్ల వరకు వరకు షేర్ ను రాబట్టాలి. డిసెంబర్లో విడుదలైన పెద్ద సినిమాలు ‘అఖండ’ ‘పుష్ప’ ‘శ్యామ్ సింగ రాయ్’ ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతున్నాయి. ‘అతిథి దేవో భవ’ చిత్రం ‘1945’ కి అంత పోటీ ఇచ్చే చిత్రం కాకపోయినా.. డిసెంబర్ పెద్ద సినిమాల పోటీని తట్టుకుని నిలబడితే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.
అది కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. ఇది పాత సినిమా కాబట్టి… పైగా కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ‘1945’ ఎంత వరకు రాణిస్తుందో చూడాలి..!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!