రానా, రెజీనా జంటగా సత్య శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘1945’.’కె.ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్.ఎన్.రాజ రాజన్, సి.కళ్యాణ్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ నిజానికి 4ఏళ్ళ క్రితం మొదలైంది. కానీ అనేక కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. మొత్తానికి ఆ అడ్డంకుల్ని అన్నిటినీ దాటుకుని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. నాజర్, సత్యరాజ్, సప్తగిరి వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తుంది అని ట్రేడ్ పండితులు అనుకున్నారు.
అయితే సినిమాకి డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజుకి థియేటర్లు ఖాళీ అయిపోయాయి.ఇక సంక్రాంతి సినిమాలు ఎంట్రీ ఇవ్వడంతో మొత్తానికి దుకాణం సర్దేసింది ఈ చిత్రం. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్లు గమనిస్తే :
నైజాం | 0.17 cr |
సీడెడ్ | 0.06 cr |
ఆంధ్రా(టోటల్) | 0.11 cr |
ఏపి+తెలంగాణ (టోటల్) | 0.34 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.04 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 0.38 cr |
‘1945’ చిత్రాన్ని నిర్మాత సి.కళ్యాణ్ చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.25 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.38 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. నెగిటివ్ షేర్లు వంటివి తీసేయగా మిగిలిన షేర్.దీంతో బయ్యర్లకి రూ.0.87 కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!