అందుకే ‘1945’ ప్రమోషన్లు నిర్వహించలేదా..!

  • January 7, 2022 / 05:51 PM IST

‘బాహుబలి’ పూర్తయిన టైంలోనే రానా హీరోగా బ్రిటీష్ పాలన నేపథ్యంలో రూపొందిన చిత్రం దేశభక్తి చిత్రం ‘1945’. నిజానికి ఈ రోజు దేశభక్తి కథాంశంతో రూపొందిన ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీస్టారర్ ను చూద్దామని ఆశపడిన ప్రేక్షకులకి రానా ‘1945’ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.’ఈ సినిమాతో నాకు ఎటువంటి సంబంధం లేదు’ అని రానా ఇది వరకే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. ‘అసలు ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు..

కేవలం క్యాష్ చేసుకోవడానికి మాత్రమే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.దయచేసి దీన్ని ఎంకరేజ్ చేయకండి’ అంటూ రానా ఆవేదన వ్యక్తం చేసాడు. ‘షూటింగ్ పూర్తయ్యిందో లేదో డిసైడ్ చెయ్యాల్సింది దర్శకుడు’ అంటూ నిర్మాత కూడా రానాకి కౌంటర్ ఇచ్చాడు. ఆ టైములో ఇలా బహిరంగంగా తాను ఓకె చేసిన సినిమాతో ‘నాకు సంబంధం లేదు’ అని రానా చెప్పడం జనాలకి నచ్చలేదు. నానా గొడవల్ని ఎదుర్కొని చివకారికి సి.కళ్యాణ్ పుణ్యమా అని ఈ చిత్రం ఈరోజు థియేటర్లకి వచ్చింది.

ఇక ‘1945’ చూసాక జనాలకి రానా ఆవేదన కరెక్టే అనే ఫీలింగ్ కలిగింది అనడంలో అతిశయోక్తి లేదు.సినిమాలో హీరో రానాతో పాటు రెజీనా, నాజర్, సత్యరాజ్, సప్తగిరి వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. అయితే దర్శకుడు సత్యశివ తన కథనంతో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.నటీనటుల్ని సరిగ్గా వాడుకోలేదు సరి కదా… దేశభక్తి కలిగిన సినిమాల్లో ఉండే బలమైన ఎమోషనల్ సన్నివేశాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదు అంటే దర్శకుడు ఎంత కామెడీగా తీసాడో మనం అర్ధం చేసుకోవచ్చు.

అసలు ఈ చిత్రానికి క్లైమాక్స్ అనేది లేకపోవడం సిల్లీ పాయింట్. కొద్దో గొప్పో సంతోషించే విషయం ఏంటంటే ఈ చిత్రం నిడివి 2 గంటల 2 నిమిషాలే కావడం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus