ప్రెజంట్ జనరేషన్ హీరోస్ లో హీరో-విలన్, రన్ టైమ్ ఎంత, ఏ భాష అనే తేడా చూడకుండా స్క్రిప్ట్ నచ్చితే చాలు ఏ సినిమాలోనైనా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉంటూ.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పాపులారిటీ పెంచుకుంటూ సూపర్ ఫామ్ లో ఉన్న ఏకైక నటుడు రాణా దగ్గుబాటి. “బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి” చిత్రాలతో వరుస విజయాలతోపాటు పాపులారిటీ అండ్ క్రేజ్ కూడా పెంచుకుంటుపోతున్నాడు రాణా. రెగ్యులర్ మాస్ ఎంటర్ టైనర్స్ చేయకుండా విభిన్నమైన కథలు ఎంచుకోవడమే రాణా విజయ రహస్యం.
ఆ విజయపరంపరను కొనసాగిస్తూ మరో వైవిధ్యమైన చిత్రాన్ని ఎంపిక చేసుకొన్నాడు రాణా. 1945లో స్వాతంత్ర ఉద్యమం నేపధ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం రాణా ఓ సరికొత్త లుక్ ను ట్రై చేశాడు. జుట్టు బాగా పెంచి, వింటేజ్ ఫార్మాట్ లో మీసకట్టు సెట్ చేసుకొన్నాడు. ప్రస్తుతం లుక్ ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. డిసెంబర్ వరకూ ఏకధాటిన ఈ 1945 చిత్రాన్ని పూర్తి చేసి.. అనంతరం ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డైరక్షన్ లో సినిమా చేసేందుకు రాణా ప్లాన్ చేసుకొంటున్నాడు.