Ranbir Kapoor: యానిమల్ గురించి ఆసక్తికర వ్యాఖలు చేసిన రణబీర్.. ఏమైందంటే?

గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో యానిమల్ మూవీ కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించి కొంతమంది సెలబ్రిటీలు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించిందని చెప్పవచ్చు. యానిమల్ (Animal) సినిమా గురించి రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్ మాట్లాడుతూ యానిమల్ లాంటి సినిమా మళ్లీ చేయనని అన్నారు.

సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమందిని వేర్వేరు సందర్భాల్లో నేను కలిశానని రణబీర్ వెల్లడించారు. యానిమల్ లాంటి సినిమా నువ్వు చేయకూడదు అని వాళ్లు కామెంట్లు చేశారని రణబీర్ చెప్పుకొచ్చారు. ఆ సినిమా చూసి నిరుత్సాహానికి గురయ్యామని కొంతమంది చెప్పారని రణబీర్ కామెంట్లు చేశారు. అలా నాతో చాలామంది చెప్పారని ఆయన పేర్కొన్నారు. అలా కామెంట్లు చేసిన వాళ్లందరికీ నేను క్షమాపణలు చెబుతున్నానని రణబీర్ తెలిపారు.

అయితే నా క్షమాపణలు మరోసారి చేయననే హామీలు వాళ్లకు మాత్రమే పరిమితమని ఆయన అన్నారు. ఒకింత గందరగోళంతో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఇప్పుడు నేను ఉన్న స్టేజ్ లో వాళ్లతో వాదించడం సరికాదని ఆయన తెలిపారు. చాలా ఏళ్లుగా అందరూ నన్ను ఫ్యూచర్ సూపర్ స్టార్ అని పిలుస్తున్నారని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు.

ఇంకెన్నాళ్లు అలా పిలుస్తారని రణబీర్ కామెంట్లు చేశారు. నేను మరో మెట్టు పైకి ఎక్కాలని వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టాలని ఆయన పేర్కొన్నారు. అప్పుడే నన్ను సూపర్ స్టార్ అని పిలుస్తారని రణబీర్ పేర్కొన్నారు. యానిమల్ మూవీ నా కెరీర్ లో సరైన సమయంలో పడిందని ఆయన వెల్లడించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus