Ranbir Kapoor: ‘యానిమల్‌’ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును వాళ్లిద్దరికి అంకితమిచ్చిన రణ్‌బీర్‌!

గతేడాదికిగాను ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను ఇటీవల ప్రదానం చేశారు. ఊహాగానాలను నిజం చేస్తూ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా జంటకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డులు వచ్చేశాయి. అంతేకాదు రణ్‌బీర్‌ నటించిన ‘యానిమల్‌’ సినిమాకు అత్యధిక అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో రణ్‌బీర్‌ కపూర్‌ చేసిన కొన్ని సరదా కామెంట్స్‌ ఆసక్తికర చర్చను తీసుకొచ్చాయి. అలా ఎందుకు అన్నాడు అనే ప్రశ్నలు రేకెత్తించాయి. హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నాక…

ఆ పురస్కారాన్ని తన తండ్రి రిషి కపూర్‌, కుమార్తె రాహాకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. అలాగే ఆ వేడుకలో తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మాట్లాడటం ఆకర్షించింది. ‘‘నాన్నా నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తా. మీరు నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతను రోజూ గుర్తుచేసుకుంటా. మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని ఈ వేదిక సాక్షిగా కోరుకుంటున్నా’’ అని అన్నాడు రణ్‌బీర్‌. నా కూతురు రాహా పుట్టిన వారం తర్వాత ‘యానిమల్‌’ సినిమా షూటింగ్‌ ప్రారంభించాం.

రాహా అంటే నాకు చాలా ఇష్టం. నా కూతురి అల్లరిని మిస్‌ అవ్వకూడదని షూటింగ్‌ అయిపోయాక వెంటనే ఇంటికి వెళ్లిపోయేవాణ్ని అని చెప్పాడు రణ్‌బీర్‌. ఆ తర్వాత రణ్‌బీర్‌ చెప్పిన మాట ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘‘రాహా నువ్వు ఆడుకోవడానికి అమ్మ, నేను అవార్డులు తీసుకొస్తున్నాం’’ అంటూ కూతురును తలచుకుంటూ మాట్లాడాడు రణ్‌బీర్‌. బాలీవుడ్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల గురించి రణ్‌బీర్‌ అలా అనడం ఏంటి అనే మాట అంటున్నారు నెటిజన్లు.

అయితే అది అతను ఏదో సరదాగా అన్నమాటలు అవి అని (Ranbir Kapoor) రణ్‌బీర్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ‘యానిమల్‌’ చిత్రానికి రణ్‌బీర్‌కు అవార్డు రాగా… ఆయన భార్య అలియా భట్‌ ఉత్తమ నటిగా ‘రాకీ ఔర్‌ రాణీకీ ప్రేమ్‌ కహానీ’ సినిమాకు అవార్డు అందుకుంది. ‘యానిమల్‌’ సినిమాకు మొత్తంగా ఆరు ఫిల్మ్‌ ఫేర్‌ పురస్కారాలు దక్కడం గమనార్హం.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus