Ranbir Kapoor: సినిమా డిజాస్టర్‌పై స్పందించిన స్టార్ హీరో!

ఏంటీ.. గడ్డం వల్ల సినిమా పోయిందా? అదెలా సాధ్యం? అనుకుంటారా.. మీరు అనుకున్నది నిజమే అయితే.. కానీ ఇక్కడ కారణం నిజం గెడ్డం కాదు, పెట్టుడు గెడ్డం. ఈ మాట అన్నది ఎవరో కాదు.. ఆ గెడ్డం పెట్టుకుని డిజాస్టర్‌ను మూటగట్టుకున్న ఆ హీరోనే. అతనే బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌. నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన ఆ మధ్య ‘షంషేరా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర చేదు అనుభవాన్నే మిగిల్చింది. దాని గురించి ఇటీవల స్పందించారు రణ్‌బీర్‌.

కరోనా, తదితర పరిస్థితుల వల్ల రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాలకు సుమారు నాలుగేళ్లు దూరమయ్యాడు. ఎంతో ప్రాణంగా కష్టంగా పని చేసిన ‘షంషేరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. సినిమా కోసం ఎంతో కష్టపడి ప్రచారం కూడా చేశాడు. అయితే ఆ సినిమాకు సరైన ఫలితం దక్కలేదు. దానికి కారణం గడ్డమే అని అంటున్నాడు రణ్‌బీర్‌. ఆ సినిమాలో రణ్‌బీర్‌ పాత్రకు గడ్డం ఉంటుంది. అయితే ఆయన సినిమా కోసం గడ్డం పెంచకుండా.. పెట్టుడు గడ్డం పెట్టుకున్నాడు.

‘షంషేరా’ సినిమా చూస్తే.. మండుటెండలో ఎక్కువ సీన్స్ ఉంటాయి. ఆ సమయంలో గడ్డం సహజంగా కనిపించకుండా.. కృతకంగా కనిపించింది. ఆ మాట అప్పుడే రివ్యూల్లో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దాని గురించే ఇప్పుడు రణ్‌బీర్‌ మాట్లాడాడు. ‘‘నేను చేసిన అతి కష్టమైన సినిమాల్లో ‘షంషేరా’ ఒకటి. ఆ సినిమా ఫ్లాప్‌ వెనుక మా పొరపాట్లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి నా గడ్డం. నేను ఈ సినిమా కోసం ఆర్టిఫిషియల్‌ గడ్డం పెట్టుకున్నాను.

ఎండలో షూటింగ్‌ చేసేటప్పుడు అది సహజంగా కనిపించలేదు’’ అని చెప్పాడు రణ్‌బీర్‌. ఆ గడ్డం ముఖానికి ఏదో అతుక్కున్నట్లు కనిపించింది. దీంతో ప్రేక్షకులు ఆ పాత్రకు కనెక్ట్‌ అవ్వలేకపోయారు. దీంతో సినిమా ఫ్లాప్‌ అయ్యింది అని చెప్పాడు. అలాగే 2017లో విడుదలైన ‘జగ్గా జూసూస్‌’ సినిమా హిట్‌ అవ్వకపోవడం కూడా ఎంతో బాధించిందని రణబీర్‌ తెలిపాడు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus