‘ఉప్పెన’ కొండపొలం’ వంటి చిత్రాల అనంతరం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ గా రీమేక్ చేసి హిట్టు కొట్టిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సెప్టెంబర్ 2న(నిన్న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. దీంతో మొదటి రోజు కలెక్షన్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు అనే చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.30 cr |
సీడెడ్ | 0.10 cr |
ఉత్తరాంధ్ర | 0.10 cr |
ఈస్ట్ | 0.10 cr |
వెస్ట్ | 0.06 cr |
గుంటూరు | 0.15 cr |
కృష్ణా | 0.08 cr |
నెల్లూరు | 0.06 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.95 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.06 cr |
ఓవర్సీస్ | 0.07 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.08 cr |
‘రంగ రంగ వైభవంగా’ చిత్రానికి రూ.8.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇది చాలా ఈజీ టార్గెట్. కానీ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు కేవలం రూ.1.08 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ కు మరో రూ.7.42 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ ఓపెనింగ్స్ తో బ్రేక్ ఈవెన్ సాధించడం అంటే బాగా కష్టం అనే చెప్పాలి. శని, ఆదివారాలు గట్టిగా కుమ్మితే తప్ప బ్రేక్ ఈవెన్ అసాధ్యమనే చెప్పాలి. చూడాలి మరి ఫైనల్ గా ఎంత రాబడుతుందో..!
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర