నాగశౌర్య హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ను అందించిన ‘ఎస్‌ఎల్‌వి సినిమాస్’ సంస్థ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ‘ఛలో’ తర్వాత నాగ శౌర్య.. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ చేసాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేశాయి.
పైగా నిర్మాత కూడా ‘దసరా’ తో సూపర్ హిట్ అందుకోవడంతో ఈ మూవీకి మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 2.00 cr |
సీడెడ్ | 0.70 cr |
ఉత్తరాంధ్ర | 0.55 cr |
ఈస్ట్ | 0.25 cr |
వెస్ట్ | 0.20 cr |
గుంటూరు | 0.26 cr |
కృష్ణా | 0.30 cr |
నెల్లూరు | 0.16 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.42 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.25 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.67 cr (షేర్) |
‘రంగబలి’ (Rangabali) చిత్రానికి రూ.4.67 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ కనుక వస్తే టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే కష్టమే అని చెప్పాలి.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!