Rangabali OTT: రంగబలి సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లో వస్తుంధియాంటే!

హీరో నాగశౌర్య పేరు చెప్పగానే మంచి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. అలానే చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఛలో’ తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కట్లేదు. ఇప్పుడు ‘రంగబలి’ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో బ్లాక్ బస్టర్ కొట‍్టబోతున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గట్టిగా చెప్పుకొచ్చాడు. పలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన నాగ శౌర్య రంగబలి అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో మన ముందుకు వచ్చారు.

కొత్త ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ బాసంశెట్టితో క‌లిసి ‘రంగ‌బ‌లి’ని తీసుకొచ్చారు నాగశౌర్య‌. ప్రమోషన్స్ ఎంటర్టైనింగ్ గా సాగ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రంపై ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. ఆ అంచ‌నాల్ని ఈ సినిమా అందుకుందా? సగం వరకే అని చెప్పాలి. సత్య కామెడీ ప్లస్ అయిన ఈ చిత్రంతో నాగ‌శౌర్య మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారా? అనేది ఈ రోజు రిలీజ్ టాక్ తో ప్రజలకు తెలిసిపోయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి విషయం బయిటకు వచ్చింది. ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని నెట్ ప్లిక్స్ తీసుకుంది. సినిమా రిలీజైన నెల దాటాక అంటే ఆగస్ట్ 7 నుంచి పది లోపల ఓటిటిలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం (Rangabali) కథ విషయానికి వస్తే..చావైనా.. బ‌తుకైనా సొంతూరులో సింహంలా బ‌త‌కాల‌ని ఆశ‌ప‌డే ఓ కుర్రాడి క‌థ ఇది. అయితే ఆ కుర్రాడి ప్రేమ క‌థ‌కు ఆ ఊరిలోని రంగబలి అనే సెంట‌ర్ వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదురైతే ఏం చేశాడు?దాని పేరు మార్చేందుకు అత‌నెంత దాకా వెళ్లాడు? ఈ క్ర‌మంలో ఎలాంటి స‌వాళ్లు ఎదుర్కొన్నాడు? అన్న‌ది ఈ చిత్ర క‌థాంశం. ఈ క‌థ ఫస్టాఫ్ అంతా ఫ‌న్ తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా సాగితే.. సెకండాఫ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లా సీరియ‌స్‌గా న‌డుస్తుంది. అదే కాస్త ఇబ్బంది పెడుతుంది.

ఫస్టాఫ్ లాగే సెకండాఫ్ కూడా అదే జోష్ లో ఫన్ తో నడిచిపోతే బాగుండేదని ప్రేక్షకులు భావించారు. సెకండాఫ్ మొద‌ల‌వ‌గానే ఒక్క‌సారిగా సీరియ‌స్ మూడ్‌లోకి మారిపోతుంది. రంగ‌బ‌లి సెంట‌ర్ పేరు మార్చ‌డం కోసం శౌర్య చేసే కొన్ని ప్ర‌య‌త్నాలు కామెడిగా నవ్వులు రప్పించినా.. మిగతావి సిల్లీగా అనిపిస్తాయి. సెంటర్ కు పేరు మార్చాల‌నే క్ర‌మంలో శౌర్య‌కు ఊరి ఎమ్మెల్యేకు మ‌ధ్య కాంప్లిక్ట్ మొద‌లవ్వ‌డంతో క‌థ కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. ఈ సినిమాలో త్వరలో ఓటీటీలో చూద్దాం.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus