Rangasthalam Mahesh: నాన్న చనిపోతే పుల్లలకి కూడా డబ్బులు లేవు!

రంగస్థలం సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు మహేష్.ఈ సినిమాలో రామ్ చరణ్ కి స్నేహితుడి పాత్రలో నటించిన మహేష్ తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని రంగస్థలం మహేష్ గా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం రంగస్థలం మహేష్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఈయన విరూపాక్ష సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే రంగస్థలం మహేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన సినీ కెరియర్ గురించి ఇండస్ట్రీలోకి రాకముందు తన ఆర్థిక ఇబ్బందుల గురించి పలు విషయాలను తెలియజేశారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతూ ఉన్నాను అదే సమయంలోనే నితిన్ గారి ఆఫీసులో నా ఫోటో ఇచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ సమయంలోనే మా తండ్రి చనిపోయారని నాకు ఫోన్ వచ్చిందని మహేష్ తెలిపారు. అలా మా తండ్రి చనిపోయారని ఫోన్ వచ్చిన ఆ క్షణం నా దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బు లేదని తెలిపారు.

మా నాన్నను కాటి దగ్గరకు తీసుకెళ్లి అక్కడ తగలబెట్టడానికి పుల్లలకు 500 రూపాయలు చెల్లించాలి చివరికి ఆ పుల్లలకు డబ్బులు కూడా నా దగ్గర లేవని మహేష్ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఈ జీవితం ఎందుకురా అనిపించింది.ఆ క్షణం నాకు దగ్గరైన వాళ్లు కూడా నన్ను తిట్టారని ఈయన తెలిపారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తాను జీరో అని అయితే ఇక్కడ మనం ఎంత సక్సెస్ అయితే అంత పేరు ప్రఖ్యాతలు ఉంటాయని మహేష్ తెలిపారు. ఇక తనకు సింపుల్ గా ఉండటమే ఇష్టం అని పెద్దగా హడావిడి తనకు నచ్చదని తెలిపారు. అలాగే తనకు కార్లన్నా కూడా పెద్దగా ఇష్టం లేదు అంటూ ఈ సందర్భంగా మహేష్(Mahesh) చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus