మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆల్ టైం హిట్ మూవీ ‘రంగస్థలం’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై వై.నవీన్, వై.రవి శంకర్, సి.వి.మోహన్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2018 వ సంవత్సరం మార్చి 30న విడుదలైంది. 1985 వ సంవత్సరంలో గోదావరి జిల్లాల వాతావరణం, అక్కడి నేపథ్యం, అణగదొక్కడం, రాజకీయాలు ఎలా ఉండేవి… అనే అంశాలతో రివేంజ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది.
మొదట ఈ మూవీ పై అంచనాలు అంతంత మాత్రమే ఉన్నాయి. కానీ మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో భారీ కలెక్షన్లను నమోదు చేసింది ఈ చిత్రం. వినికిడి ఇబ్బంది కలిగిన వ్యక్తి చిట్టిబాబుగా రాంచరణ్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. నేటితో ఈ చిత్రం విడుదలై 4 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 27.60 cr |
సీడెడ్ | 17.40 cr |
ఉత్తరాంధ్ర | 13.25 cr |
ఈస్ట్ | 08.20 cr |
వెస్ట్ | 06.35 cr |
గుంటూరు | 08.50 cr |
కృష్ణా | 07.17 cr |
నెల్లూరు | 03.48 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 91.95 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 11.10 cr |
ఓవర్సీస్ | 16.40 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 119.45 cr |
‘రంగస్థలం’ చిత్రానికి రూ.80.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.119.45 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకి రూ.39.09 కోట్ల భారీ లాభాలు అందినట్టు స్పష్టమవుతుంది. అంతేకాదు ‘బాహుబలి’ తర్వాత రూ.209 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టి.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?