Ranveer Singh, Deepika Padukone: ఐపీఎల్ టీమ్ కోసం దీపికా: రణవీర్ ప్లాన్!

బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీపికా తన భార్య రణవీర్ సింగ్ తో కలిసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతుంది. అది కూడా వేల కోట్లకు కేంద్రబిందువైన క్రికెట్ బిజినెస్ కావడం విశేషం. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రణవీర్, దీపికా కలిసి ఐపీఎల్ లీగ్ లో భాగం అవుతున్నారు. ఐపీఎల్ లో బాలీవుడ్ స్టార్స్ భాగం కావడమనేది చాలా ఏళ్లుగా జరుగుతున్న విషయమే.

ఇప్పటికే ఐపీఎల్ లో ఎనిమిది టీమ్స్ ఆడుతున్నాయి. వచ్చే ఏడాది మరో రెండు టీమ్స్ ను పెంచే ఆలోచనతో బిసిసిఐ బిడ్స్ కు ఆహ్వానం ఇచ్చింది. ఈ బిడ్స్ కోసం రణవీర్ సింగ్, దీపికా అప్లై చేశారని టాక్. మరో విషయమేమిటంటే.. ఈ బాలీవుడ్ క‌పుల్‌ ను ముందు పెట్టి కొన్ని కార్పొరేట్ సంస్థ‌లు వెనుకుండి ఐపీఎల్ ఫ్రాంచైజీని కోనుగోలు చేయ‌బోతున్నార‌ని టాక్. వీరితో పాటు పేరున్న చాలా మంది బిడ్స్ వేశారట. అక్టోబర్ 25న ఎవరు బిడ్స్ లో విజేతలుగా నిలిచారనే విషయాన్ని ప్రకటించనున్నారు.

అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. క్రికెటర్ దినేష్ కార్తీక్ ఫన్నీగా స్పందించాడు. రణవీర్ సింగ్, దీపిక పదుకునే కొనుగోలు చేయబోయే ఫ్రాంచైజీ జెర్సీ మాత్రం భలే ఇంటరెస్టింగ్‌గా ఉంటుందని వెటకారంగా కామెంట్ చేశాడు. మరోవైపు మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 స్టేజి మొదలు కానుంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus