బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ వింత చేష్టల గురించి అందరికీ తెలిసిందే.మామూలుగానే అతని డ్రెస్సింగ్ స్టైల్ వింత వింతగా ఉంటుంది. అలాంటిది ఈ మధ్య నగ్నంగా ఓ ఫోటో షూట్లో పాల్గొన్నాడు. అతన్ని చూసి విష్ణు విశాల్, మన టాలీవుడ్ నటుడు నందు వంటి వారు కూడా నగ్నంగా తమ భార్యలతోనే ఫోటోలు తీయించుకున్నారు. ఈ టాపిక్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రణ్వీర్ పై కేసులు కూడా వేశారు. అయితే రాంగోపాల్ వర్మ వంటి వారు అతనికి మద్దతుగా కామెంట్లు చేయడం కూడా జరిగింది.
అయితే తాజాగా ఓ నటి రణ్వీర్కు కంపెనీ ఇస్తా అంటూ ఓ టాప్ లెస్ ఫోటోని షేర్ చేసింది. ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ కు చెందిన ఎరికా ప్యాకర్డ్. రోహిత్ శెట్టి ‘ఖత్రోన్ కె ఖిలాడి 12’ టీవీ షో ద్వారా పాపులర్ అయిన ఈమె ‘రణ్వీర్ సింగ్కు కంపెనీ ఇస్తున్నాను.. అయితే నా బూ**స్ చూడలేరు’ అంటూ కామెంట్స్ పెట్టి తన టాప్లెస్ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫొటోపై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.
‘దేశ సంస్కృతిని చెడగొట్టడానికి ఇక్కడ చాలా మంది తయారయ్యారు. యువత(యంగ్ ఏజ్ అమ్మాయిలను) చెడగొట్టే విధంగా ఉన్నాయి ఈ ఫోటోలు’ అంటూ కొంతమంది మండిపడుతుంటే.. మరికొంతమంది ఎరికా ప్యాకర్డ్ బోల్డ్ నెస్ ను మెచ్చుకుంటున్నారు. మరికొంతమంది అయితే ఇదంతా పాపులారిటీ కోసమే.. అప్పుడు సినిమాల్లో మంచి పాత్రలు వస్తాయనేది వీళ్ళ ఆలోచన అంటూ చురకలు అంటిస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో అయితే వైరల్ గా మారింది.