‘ది రాజాసాబ్’ తో 2025 కి ప్రభాస్ మంచి ఎండింగ్ ఇస్తాడు అని అంతా భావిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేసిన ఈ హారర్ రొమాంటిక్ మూవీ డిసెంబర్ 5కి రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావాలి. కానీ పలు కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు మేకర్స్. ఫైనల్ గా డిసెంబర్ 5ని ఫిక్స్ చేసుకున్నట్టు టీజర్ తో స్పష్టంచేశారు. షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తికావచ్చింది. సాంగ్స్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు కారణం బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ అంటున్నారు. మేటర్ ఏంటంటే అతను హీరోగా ‘దురంధర్’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ 5నే ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేయాలని భావిస్తున్నారు.
అయితే అదే రోజు ‘ది రాజాసాబ్’ వస్తే ‘దురంధర్’ ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడటం ఖాయం. అందుకే ఆ డేట్ కి అనుకున్న చాలా సౌత్ సినిమాలు వెనక్కి వెళ్లాయి. ‘దురంధర్’ యూనిట్ మాత్రం తమ సినిమాను డిసెంబర్ 5నే విడుదల చేయాలని భావిస్తోంది. అందుకే హీరో రణ్వీర్ సింగ్ ప్రభాస్‌ను సంప్రదించి.. ‘మీ ‘రాజాసాబ్’ ని వాయిదా వేసుకోవాలని’ కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాతలైన ‘పీపుల్ మీడియా’ వారి వద్ద ప్రభాస్ ప్రస్తావించడం కూడా జరిగిందట.
అందుకే ‘ది రాజాసాబ్’ ను 2026 సంక్రాంతి బరిలో దించాలని పీపుల్ మీడియా వారు ప్లాన్ చేస్తున్నారు. కానీ 2026 సంక్రాంతికి ఆల్రెడీ చిరు- అనిల్.. వంటి పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ‘రాజాసాబ్’ కనుక వస్తే మిగిలిన సినిమాలకు ఇబ్బంది లేకుండా ముందుగా దింపే అవకాశం లేకపోలేదు.