Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 3, 2026 / 02:15 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సత్య దేవ్ (Hero)
  • దీపా థామస్ (Heroine)
  • వికాస్ ముప్పాల, బాల పరసార్, ఆనంద్ భారతి, కునాల్ కౌశిక్, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ తదితరులు (Cast)
  • వెంకటేష్ మహా (Director)
  • చింతా గోపాల కృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయ రాఘవన్ (Producer)
  • స్మరణ్ సాయి (Music)
  • కార్తీక్ పర్మార్ (Cinematography)
  • వెంకటేష్ మహా (Editor)
  • Release Date : 3rd జూలై 2026
  • శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్, బెటర్ ఇన్వెస్ట్ మీడియా విజన్ ఫండ్, మహాయాన మోషన్ పిక్చర్స్ (Banner)

‘కేరాఫ్ కంచెరపాలెం’ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా తన ముద్ర వేసుకున్నాడు వెంకటేష్ మహా. అయితే అతని 3వ సినిమా కోసం దాదాపు 6 ఏళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది. మళ్ళీ సత్యదేవ్ తోనే ‘రావు బహదూర్’ (Rao Bahadur) అనే సినిమా తీశాడు. ఇదొక పీరియాడిక్ సినిమా. ఈ ప్రాజెక్టుకి మహేష్ బాబు,నమ్రత సమర్పకులుగా వ్యవహరించడంతో ప్రత్యేకతని సంతరించుకుంది. టీజర్, ట్రైలర్ వంటివేవీ కథపై ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఇవ్వలేకపోయాయి. అలాగే ఆడియన్స్ కూడా ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఓపెన్ మైండ్ తో థియేటర్..కి రావాలని దర్శకుడు, నిర్మాతలు కోరడం జరిగింది. ఫైనల్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రావు బహదూర్’ సినిమా ఆడియన్స్ కి ఎలాంటి ఫీలింగ్ ఇచ్చిందో తెలుసుకుందాం రండి:

Rao Bahadur Movie Review

Rao Bahadur Movie Review and Rating

కథ: భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప (Satyadev) రాజవంశస్థుడైనప్పటికీ.. పెళ్లి, వంశం అనే వాటికి దూరంగా ఉండి, ప్రపంచంలోని అందాలను ఆస్వాదించాలని విదేశాలకు వెళ్ళిపోతాడు. అతనిపై బెంగతో తండ్రి సిద్దప్ప (కునాల్ కౌశిక్) మంచాన పడతాడు. దీంతో రామప్ప స్నేహితుడు, ఫ్యామిలీ డాక్టర్ అయిన ఆచారి (వికాస్ ముప్పాల) ప్రపంచం మొత్తం జల్లెడపట్టి రామప్ప ఆచూకీ తెలుసుకుంటాడు. విషయం నేరుగా చెప్పకుండా రామప్పను తిరిగి తన సంస్థానానికి వచ్చేలా చేస్తాడు.ఈ క్రమంలో తండ్రి సిద్దప్పకు సేవలు చేయడానికి వచ్చిన రేణుక (దీపా థామస్) అనే ఆంగ్లో ఇండియన్ నర్స్ ను రామప్ప తొలిచూపులోనే చూసి ప్రేమలో పడతాడు. తండ్రి సిద్దప్ప మరణించిన తర్వాత రేణుకకు రామప్ప ఇంట్లో పని ఉండదు కాబట్టి, ఆమె తన ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతుంది. అప్పుడు తాను ఆమెను ప్రేమిస్తున్నట్లు రామప్ప చెబుతాడు. కానీ, తాను వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నానని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత తన స్నేహితుడు ఆచారి సాయంతో రేణుకను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు రామప్ప. వీరికి మొదటి సంతానంగా లవణ (ప్రణయ్ వాకా) జన్మిస్తాడు.

అతడిని ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు రామప్ప. కొన్నాళ్లకు రెండో సంతానంగా కుసుమప్ప (మాస్టర్ కిరణ్) జన్మిస్తాడు. అయితే కుసుమప్ప నల్లగా పుడతాడు. దీంతో బంధువులంతా అతని రంగు గురించి అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఆ అవమానం తట్టుకోలేని రామప్ప, కుసుమప్పను అసహ్యించుకుంటూ ఉంటాడు. ఆ పిల్లాడు తన కొడుకే కాదనే అనుమానం పెట్టుకుని పైకి చెప్పకుండా భార్యను వేధిస్తూ ఉంటాడు. ఈ అవమానాలు చూసి తట్టుకోలేక కుసుమప్ప ఆత్మహత్య చేసుకుంటాడు.దీంతో భార్య రేణుక రామప్పను అసహ్యించుకుని అతనికి దూరంగా ఒక గదికే పరిమితమైపోతుంది. అప్పటి నుండి రామప్ప మరింత కృంగిపోయి మద్యానికి బానిసవుతాడు. ఈ క్రమంలో కాలేయం (లివర్) పాడైపోయి ఏడాదిలో చనిపోవాల్సిన వాడు, ఏళ్లు గడిచినా చనిపోడు. అందుకు కారణం ఏమిటి? అన్నదే మిగిలిన కథ.

Rao Bahadur Movie Review and Rating

నటీనటుల పనితీరు: సత్యదేవ్ మంచి నటుడు. రామప్ప పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. వాటన్నిటినీ బ్యాలన్స్ చేస్తూ అద్భుతంగా నటించాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రమోషన్స్ లో అతన్ని ఏకంగా కమల్ హాసన్ తో పోల్చేశాడు దర్శకుడు. ఆ కామెంట్స్ తో కంపేర్ చేసుకోకుండా చూస్తే సత్యదేవ్ నటనని ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. దీపా థామస్ తెలుగు ఆడియన్స్ కి కొత్త. అయినప్పటికీ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది.

ఆమె లుక్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి. స్నేహితుడి పాత్రలో వికాస్ ముప్పాల కూడా చక్కగా నటించాడు. రామప్ప తండ్రి పాత్రలో కునాల్ కౌశిక్ కనిపించేది కాసేపే అయినా బాగా చేశాడు. సీనియర్ నటుడు ఆనంద్ పాత్ర ఓకే. పనిమనిషి అచ్చమ్మగా కనిపించిన బల పరసర్ కూడా బాగా చేసింది. మాస్టర్ కిరణ్ కి మంచి ఫ్యూచర్ ఉంది. ఈ పిల్లాడు తన నటనతో ఆడియన్స్ ని ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు అనడంలో సందేహం లేదు. మిగతా నటీనటులు ఓకే.

Rao Bahadur Movie Review and Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు వెంకటేష్ మహా దాదాపు 5 ఏళ్ళ పాటు ‘రావు బహదూర్’ స్క్రిప్ట్ పై వర్క్ చేశాడట. ప్రమోషన్స్ లో అయితే ఏకంగా ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పాడు. తప్పులేదు దర్శకుడికి తన ప్రాజెక్టుపై ఉండే ప్రేమకి కొలమానం అంటూ ఉండదు. అప్పుడు ‘బాహుబలి’ ఏంటి, ‘ఆర్ఆర్ఆర్’ ఏంటి.. ‘అవతార్’ ‘అవెంజర్స్’ తో కూడా కంపేర్ చేసుకుంటారు. కానీ ఆడియన్స్.. వాటిని యాక్సెప్ట్ చేయాలంటే సినిమా ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ కచ్చితంగా ఇవ్వాలి. మరి అలాంటి అనుభవాన్ని ‘రావు బహదూర్’ ప్రేక్షకులకి అందించేలా ఉందా? అంటే..అవునని చెప్పలేని పరిస్థితి.

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది. ఆ స్లో నెరేషన్ కి ప్రేక్షకులు నిద్రపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. 4 సీన్లలో చెప్పాల్సిన విషయాన్ని దర్శకుడు వెంకటేష్ మహా 40 సీన్లు తీసుకున్నాడా? అనిపిస్తుంది. ఎక్కడా కథనం వేగం పుంజుకోదు. అయితే సెకండాఫ్ కొంచెం బెటర్. అలా అని అద్భుతం అనడానికి లేదు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్లో కొంచెం కథలో డెప్త్ ఉంటుంది. దర్శకుడు వెంకటేష్ మహా గత 2 సినిమాల్లోనూ మంచి హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి. ‘రావు బహదూర్’ తో కూడా దానిని కంటిన్యూ చేసే ప్రయత్నం చేశాడు. మిగతా టెక్నికల్ టీమ్ గురించి చెప్పుకోవాలంటే మ్యూజిక్ డైరెక్టర్ స్మరన్ వర్క్ బాగుంది. రెండు పాటలు వినడానికి బాగున్నాయి. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా ఆడియన్స్ ని అలర్ట్ అయ్యేలా చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కానీ ఎందుకో లాంగ్ షార్ట్స్ ఎక్కువగా పెట్టాడు. అది దర్శకుడి ఇంట్రెస్ట్ అనుకుంట. కథ మొత్తం ఒక్కటే ప్యాలెస్లో చుట్టేశారు. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి.

Rao Bahadur Movie Review and Rating

విశ్లేషణ: సైకలాజికల్ థ్రిల్లర్స్ మన తెలుగులో వర్కౌట్ అయిన సందర్భాలు లేవు. అయినప్పటికీ ‘రావు బహదూర్’ తో దర్శకుడు వెంకటేష్ మహా అలాంటి ప్రయోగమే చేశాడు. ఎంత ఓపెన్ మైండ్..తో థియేటర్ కి వచ్చినా… ఇంత స్లో నెరేషన్ వంటకం ఆడియన్ కి రుచించకపోవచ్చు.

Rao Bahadur Movie Review and Rating

ఫోకస్ పాయింట్: బోరింగ్ సైకలాజికల్ డ్రామా

రేటింగ్: 2.25/5

 

Rating

2.25
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepa Thomas
  • #Rao Bahadur Movie
  • #Satya Dev
  • #Venkatesh Maha
  • #Vikas Muppala

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

15 mins ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

7 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

12 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

13 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

3 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

8 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

10 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

10 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version