అప్పటివరకూ కన్నడ ఇండస్ట్రీ అంటే కేవలం బెంగుళూరుకు మాత్రమే పరిమితమైంది. అలాంటి ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం “కె.జి.ఎఫ్”. కథ ఏమిటి అనేది ఫస్ట్ టైమ్ చూసినవాళ్లెవరికీ అర్ధం కాకపోయినా.. ఆ ఎలివేషన్ సీన్స్, ఊర మాస్ ఫైట్స్ చూసిన ఆనందంలో పెద్దగా పట్టించుకోలేదు. ఆ సినిమా కన్నడ భాషలో మాత్రమే కాక తెలుగులోనూ భారీ హిట్ నమోదు చేసింది. ఆదేరోజు విడుదలైన “పడి పడి లేచే మనసు, అంతరిక్షం” లాంటి తెలుగు సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలమవ్వడంతో తెలుగు బాక్సాఫీస్ దగ్గర కూడా “కె.జి.ఎఫ్” రచ్చ చేసింది. దాంతో ఆ సినిమా సీక్వెల్ కి భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకే.. మొదటి పార్ట్ లో ఏరియా వైజ్ ఆర్టిస్టులు ఎవరూ లేకపోవడంతో రీచ్ కాస్త తగ్గిందని గమనించిన దర్శకనిర్మాతలు ఇప్పుడు అన్నీ భాషల నుంచి నటులను క్యాస్ట్ చేస్తున్నారు.
అందులో భాగంగానే బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ ను, తమిళ ఇండస్ట్రీ నుంచి కొందరు పాపులర్ విలన్స్ ను తీసుకొన్న “కె.జి.ఎఫ్” టీం తెలుగు ఇండస్ట్రీ నుంచి రావు రమేష్ ను సెలక్ట్ చేసుకున్నారు. సినిమాలో రావు రమేష్ చేయబోయేది చాలా కీలకపాత్ర అని తెలుస్తోంది. ఆగస్ట్ నుంచి ఆయన ఉన్న పార్ట్ షూట్ స్టార్ట్ అవుతుందట. రావు రమేష్ ఎలాగూ తాను పోషించే పాత్రకు ప్రాణం పోసేస్తారు. మరి కె..జి.ఎఫ్ లో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి.