‘ఇస్మార్ట్ శంకర్’ తో (iSmart Shankar) రామ్ కి (Ram) ఉన్న మాస్ ఇమేజ్ డబుల్ అయ్యింది. దాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నంలో చేసిన ‘ది వారియర్'(The Warriorr) ‘స్కంద’ (Skanda) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి సినిమాలు వర్కౌట్ కాలేదు. ‘రెడ్’ (RED)సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల కాస్తో కూస్తో పర్వాలేదు అనిపించింది. ఏదేమైనప్పటికీ రామ్ ఇప్పుడు కచ్చితంగా ఓ హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) ఫేమ్ పి.మహేష్ బాబు (Mahesh Babu P) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) ఇందులో హీరోయిన్. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ సినిమాని నిర్మించబోతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఒకటి హైదరాబాదులో, ఇంకోటి రాజమండ్రిలో జరిగింది. మూడో షెడ్యూల్ మళ్ళీ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ అనుకుంటున్నారట.
అదే ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ అనే టైటిల్. ఇది వింటుంటే అందరికీ ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు పలికిన స్లోగన్ గుర్తుకు రావచ్చు. కానీ ఈ సినిమా కథ పీరియాడిక్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. అప్పట్లో కరెంటు లేని ఒక ఊరు, అక్కడ రాజకీయాలు, హీరో ఆ సమస్యని తీర్చి ఎలా కరెంటు తెచ్చి..
తమ ఊరికి వెలుగు నింపాడు.. అనే అంశాలతో ఈ సినిమా (RAPO22) కథ ఉంటుందని టాక్. ఇందులో ఓ కీలక పాత్ర కోసం ఓ సీనియర్ హీరో నటించాల్సి ఉందట. ఆ పాత్ర కోసం మోహన్ లాల్ (Mohanlal) , మమ్ముట్టి (Mamootty) వంటి వారిని సంప్రదించారు. ఫైనల్ గా ఉపేంద్ర ఫిక్స్ అయినట్లు టాక్ నడిచింది. కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.