Singer Smitha: ఇప్పటివరకు ఎవరు చూడని సింగర్ స్మిత ఫ్యామిలీ ఫోటోస్.. వైరల్ అవుతున్న పిక్స్, వీడియోస్..

సింగర్ స్మిత.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు.. ప్లేబ్యాక్ సింగర్, పాప్ సింగర్, యాక్ట్రెస్, హోస్ట్ అండ్ బిజినెస్ వుమెన్‌గా డిఫరెంట్ ప్రొఫెషన్స్‌లో రాణించి తనను తాను ప్రూవ్ చేసుకున్నారామె. అలాగే తమ స్వశక్తితో ఎదగాలనుకునే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. విజయవాడకు చెందిన స్మిత 1997లో ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ‘పాడుతా తీయగా’ తో సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆమె రూపొందించిన ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

తర్వాత వెంకటేష్ ‘మల్లీశ్వరి’ మూవీతో నటిగా పరిచయమయ్యారు. సిద్దార్థ్ ‘ఆట’ లోనూ అలరించారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడలోనూ టాలెంట్ చూపించి ఆకట్టుకున్నారు. ఛార్మీ ‘అనుకోకుండా ఒకరోజు’ చిత్రంలో పాడిన ‘ఎవరైనా చూస్తుంటారా’ అనే బ్యూటిఫుల్ సాంగ్‌కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిలింఫేర్ అందుకున్నారు. స్మిత, శంశాకర్‌ని మ్యారేజ్ చేసుకున్నారు. వారికి శివి అనే పాప ఉంది.

తల్లిలానే శివి కూడా చిన్ననాటి నుండే సంగీతం పట్ల ఆసక్తి చూపుతోంది. స్మిత ఆల్బమ్స్, సాంగ్స్ గురించే కానీ ఆమె ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. దీంతో స్మిత ఫ్యామిలీ పిక్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఆమె ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 10 నుండి సోనీలివ్‌లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus