Dhamaka Movie: ధమాకా మూవీతో అరుదైన రికార్డ్.. అలా జరగడంతో?

కొన్ని సినిమాలు రొటీన్ కథలతో తెరకెక్కినా ప్రేక్షకులను మాత్రం అంచనాలను మించి ఆకట్టుకుంటాయి. అలా అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలలో ధమాకా సినిమా కూడా ఒకటి. రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్సైన ప్రేక్షకులు ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ఇండియా వైడ్ సెకండ్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రవితేజ తన టాలెంట్ తో అంతకంతకూ ఎదగడంతో పాటు అరుదైన రికార్డ్ లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ధమాకా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమా క్రిటిక్స్ ను మెప్పించలేకపోయినా ఆడియన్స్ కు మాత్రం తెగ నచ్చేసింది. ఈ సినిమా సక్సెస్ తో త్రినాథరవు నక్కిన రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

త్రినాథరావు నక్కిన తన సినిమాలలో ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు రవితేజ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. వయస్సు పెరుగుతున్నా మాస్ మహారాజ్ ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొన్ని సంవత్సరాల పాటు విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలని రవితేజ భావిస్తున్నారు.

కథ నచ్చితే మల్టీస్టారర్స్ లో నటించడానికి సిద్ధమేనని రవితేజ సంకేతాలను ఇస్తున్నారు. రవితేజకు క్రేజ్ తో పాటు మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రవితేజ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన తీరు బాగుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సినిమా సినిమాకు రవితేజ స్థాయి అంతకంతకూ పెరుగుతోంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus