రష్మీ గౌతమ్.. ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది.అంతకు ముందు ఆమె చాలా సినిమాల్లో నటించినా..సక్సెస్ రాలేదు. కానీ ‘జబర్దస్త్’ ఈమెకు మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో ఈమె ప్రేమాయణం నడుపుతున్నట్టు జరుగుతున్న ప్రచారంతో ఇంకా పాపులర్ అయ్యింది. అయితే మరోపక్క రష్మీకి పెళ్లైపోయింది.. కానీ భర్తతో మనస్పర్థలు వచ్చాయి అన్నట్టు ప్రచారం నడుస్తూనే ఉంది. ఏదేమైనా సుడిగాలి సుధీర్ అయితే సినిమాల్లో హీరోగానే కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.
అలాగే అతను తనకు మరదలు వరస అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయాలను పక్కన పెట్టేసి రష్మీ హ్యాపీగా తన పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :