Rashmi Remuneration: ఒక్కో షోలో లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రష్మి!

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్ లలో రష్మి కూడా ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో ద్వారా రష్మీ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. యాంకరింగ్ తో పాటు తన అందంతో కూడా ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ జబర్థస్త్ షోలో యాంకరింగ్ చేసే రష్మి యాంకర్ గా మాత్రమే కాకుండ నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది.

ఆమె హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలలో నటించింది. అయితే ఆ సినిమాలు ఎంతో సిల్వర్ స్క్రీన్ మీద అవకాశాలు తగ్గాయి. అందువల్ల బుల్లితెరనే నమ్ముకొని యాంకర్ గా పలు టీవీ షోల్లో చేస్తూ హీరోయిన్ లకి ఉన్న క్రేజ్ సంపాదించుకుంది. రష్మి జబర్దస్త్ తో పాటు పండుగల సందర్భంగా జరిగే పలు స్పెషల్ ఈవెంట్ లో కూడా యాంకరింగ్ చేస్తూ సందడి చేస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే రష్మి తరచు తన అందమైన ఫోటోలతో పాటు అందమైన వీడియోలను కూడా షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది .

మరొకవైపు సుధీర్, రష్మి గురించి రక రకాల వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని, ఫ్యూచర్ లో వీరిద్దరు పెళ్ళి చేసుకోబోతున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే రష్మి మాత్రం వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటుంది. అవి కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం రష్మి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బుల్లితెర మీద యాంకర్ గా ఇంత పాపులర్ అయిన రష్మి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్న విషయం గురించి చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రష్మి ఒక టీవీ షో కి దాదాపు 1.50 నుండి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రష్మి ఇంత సంపాదిస్తుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus