Rashmi: కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ రష్మీ.. ఏమైందంటే?

ఈటీవీ ఛానల్ లో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటనే సంగతి తెలిసిందే. గత కొన్ని వారాలుగా రష్మీ యాంకర్ గా ఈ షో ప్రసారమవుతూ ఉండగా ఈ షోకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. యాంకర్ గా ఈ షో ద్వారా రష్మీ కెరీర్ పరంగా మరింత క్రేజ్ ను పెంచుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆదివారం ప్రసారమవుతున్న ఎపిసోడ్ నాన్న నా హీరో పేరుతో ప్రసారం కానుంది.

ప్రముఖ టీవీ సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలు ఈ షోకు తమ తండ్రులతో కలిసి హాజరయ్యారు. బుల్లెట్ భాస్కర్ తన తండ్రితో హాజరు కాగా ఇంట్లో భాస్కర్ అన్ని కుక్కలు ఉన్నాయని కంట్రోల్ చేయొచ్చుగా అని చెబుతాడు. ఇంట్లో ఉన్న కుక్కనే కంట్రోల్ చేయలేకపోతున్నానని రోడ్డు మీద ఉన్న కుక్కను ఎలా కంట్రోల్ చేస్తానని భాస్కర్ తండ్రి చెప్పారు. బుల్లెట్ భాస్కర్ నీ కంటికి నేను కుక్కలా కనిపిస్తున్నానా అని అడగగా అలా అనకని అలా అంటే కుక్కలు బాధ పడతాయని బుల్లెట్ భాస్కర్ తండ్రి చెప్పుకొచ్చారు.

వర్ష మాట్లాడుతూ ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా నాన్న లేని లోటు తీరదని చాలా బాధగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రష్మీ కన్నీళ్లు పెట్టుకుంటూ బ్యాడ్ పేరెంట్, గుడ్ పేరెంట్ ఉంటారో లేదో తనకు తెలియదని నేను మాత్రం ఇలాంటి ఎఫెక్షన్ ను నాన్న నుంచి చూడలేదని ఆమె తెలిపారు. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ రష్మీ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చారు. ఈ ప్రోమోకు 3,60,000కు పైగా వ్యూస్ వచ్చాయి.

ఎప్పుడూ నవ్వుతూ ఉండే రష్మీ ఎమోషనల్ కావడంతో ఆమె ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు. రష్మీ ఫ్యామిలీ గురించి అభిమానులకు కూడా ఎక్కువగా తెలియదనే సంగతి తెలిసిందే. తండ్రి గురించి మాట్లాడుతూ రష్మీ ఇంత ఎమోషనల్ కావడానికి గల కారణాలను రాబోయే రోజుల్లో వెల్లడిస్తారేమో చూడాల్సి ఉంది. రష్మీ నటించిన పలు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా వేర్వేరు షోలతో రష్మీ యాంకర్ గా బిజీగా ఉన్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus