ఇక రష్మీకి అన్నీ అలాంటి రోల్సేనా!

  • November 5, 2017 / 03:27 AM IST

అప్పట్లో వెంకటేశ్వర్రావు అనే ఆర్టిస్ట్ ఒక్కసారి “డ్రైవర్ రాముడు” చిత్రంలో మాడా రోల్ చేసినప్పట్నుంచి ఆయనకి వరుసబెట్టి అవే తరహా రోల్స్ వచ్చాయట. దాంతో మామూలు వెంకటేశ్వర్రావు కాస్తా “మాడా వెంకటేశ్వర్రావు” అయిపోయాడు. అదే తరహాలో ఇప్పుడు యాంకర్ రష్మీ పరిస్థితి తయారయ్యింది. “గుంటూరు టాకీస్” చిత్రంతో టాలీవుడ్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇచ్చిన రష్మీ ఆ సినిమాలో సూపర్ హాట్ రోల్ తో రెచ్చగొట్టేసింది. ఇక అప్పట్నుంచి అమ్మడికి ఆ తరహా రోల్సే వచ్చాయి. “గుంటూరు టాకీస్” అనంతరం “అంతం, చారుశీల” వంటి సినిమాల్లో కూడా రష్మీ గ్లామర్ ను ఉపయోగించుకొనేవారే తప్పితే ఆమె పెర్ఫార్మెన్స్ ను యూటిలైజ్ చేసుకొన్నవారు లేరనే చెప్పాలి.

తాజాగా విడుదలైన “నెక్స్ట్ నువ్వే” కూడా అందుకు ఉదాహరణ అని చెప్పుకోవాలి. ఈ చిత్రంలోనూ రష్మీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో యువతను రెచ్చగొట్టింది. మాస్ ఆడియన్స్ అయితే రష్మీ ఆన్ స్క్రీన్ కనిపించినప్పుడల్లా పిచ్చెక్కిపోయారు. చూస్తుంటే రష్మీకి ఇక ఈ టైప్ హాట్ రోల్సే గతేమో. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus