తప్పు తెలుసుకున్న రష్మీ… కానీ ఉపయోగం లేదంట…!

సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ… ఇవ్వడమే ఆర్టిస్ట్ లు ఎటువంటి క్యారెక్టర్ లు చేసి పాపులర్ అవుతారో… దాదాపు అలాంటి పాత్రలే వారికి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. బహుసా డైరెక్టర్లు వారి కోసం అలాంటి పాత్రలే రాసుకుంటారనుకుంట. దీనివల్ల ఆ పాత్ర పోషించిన ఆర్టిస్ట్ లకు మళ్ళీ మళ్ళీ అలాంటి పాత్రలే వెతుక్కుంటూ వస్తుంటాయి. ఇప్పుడు ‘జబర్దస్త్’ బ్యూటీ రష్మీ గౌతమ్ పరిస్ధితి కూడా అలానే ఉంది. ‘జబర్దస్త్’ షో తో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

అయితే తక్కువ సినిమాలకే సర్దేసింది.ఇప్పుడు వరుసగా బుల్లితెర పైనే షో లు చేస్తూ బిజీగా ఉన్న రష్మీ… ఇప్పుడు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో షూట్ లేకపోవడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటూ వస్తుంది. మూగ జీవాలకు ఆహారం పెడుతూ తన వంతు సాయం చేస్తుంది. ఇక ఈ మధ్య రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఉంటూ… అలాగే వీడియో కాల్స్ ద్వారా కొన్ని యూట్యూబ్ చానల్స్ వంటి వాటికి ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఓ సినిమాలో నటించి చాలా తప్పు చేశాను అంటుంది ఈ బ్యూటీ.

2016 లో ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో రష్మీ ఓ కీలక పాత్ర పోషించింది. అయితే ఆ పాత్రకి ఈ బ్యూటీ మితి మీరిన గ్లామర్ షో చేసింది. ఆ చిత్రం బాగానే ఆడింది. కానీ అప్పటి నుండీ రష్మీకి అలాంటి పాత్రలే వస్తున్నాయి. కొన్నాళ్ళు చేసినా… తరువాత కూడా అలాంటి సినిమాలే ఏం చేస్తాం అని లైట్ తీసుకుందట. ఇప్పుడు ఆఫర్లు రావడం లేదు.అసలు ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో ఎందుకు నటించినా అని ఈ బ్యూటీ తెగ బాద పడుతున్నట్టు చెప్పుకొచ్చింది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus