Rashmi: వైరల్ అవుతున్న రష్మీ ప్రభాకర్‌ పెళ్లి ఫోటోలు..!

బుల్లితెర నటి రష్మీ పెళ్లిపీటలెక్కింది. తన ప్రియుడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అలా అని మన రష్మీ అనుకోకండి. ఈమె కన్నడ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటి రష్మీ ప్రభాకర్‌. తన ప్రియుడు నిఖిల్‌ భార్గవ్‌ను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. నిన్న అంటే ఏప్రిల్‌ 25న బెంగుళూరులో వీరి వివాహం జరిగింది. కొంతమంది సెలబ్రిటీలు వీరి పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Click Here To Watch NOW

ఇక తన పెళ్లి గురించి అలాగే కాబోయే వరుడు గురించి ముందుగానే చెప్పుకొచ్చింది రష్మీ. ఆమె మాట్లాడుతూ.. ‘నిఖిల్‌ అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాడు. మ్యూచువల్ ఫ్రెండ్స్ కావడంతో తర్వాత తరచూ కలుస్తుండేవాళ్ళం. తర్వాత మేము కూడా మంచి ఫ్రెండ్స్‌గా మారాము. తర్వాత ఒకరి పై ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఫస్ట్ నిఖిల్ ప్రపోజ్‌ చేశాడు, నేను ఓకే చెప్పేసాను. ఒక నెల క్రితం మా పెద్దలతో ఈ విషయాన్ని చెప్పాము వాళ్ళు ఆశ్చర్యపడి ఓకే చెప్పేసారు.

లాక్‌డౌన్‌ టైములో మేము ఫుడ్ ప్యాకెట్స్ కూడా పంచాము పెళ్లయ్యాక కూడా నేను నటిగా కొనసాగుతాను. అందుకు నిఖిల్‌కు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ తెలిపింది రష్మీ. ప్రస్తుతం వీరి పెళ్ళి ఫొటోలు వైరల్‌గా మారాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

 

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus