Vijay Deverakonda, Rashmika: విజయ్కి ‘జైలర్ 2’ రీల్స్… రష్మికకు ‘రణబాలి’ రీల్స్.. ఎందుకిలా జరుగుతోంది?
- October 14, 2026 / 03:30 PM ISTByFilmy Focus Desk
మొన్నీమధ్య ‘రణబాలి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మాట్లాడుతూ.. ‘జైలర్ 2’ సినిమాతో తనకు ఎలాంటి నష్టం జరగొచ్చు అనే వివరాలను చాలా క్లియర్గా కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇలా జరగొచ్చని, ఇలా కూడా జరగొచ్చని వివరాలు చెప్పాడు. అందులో ముఖ్యమైన అంశం.. తన సినిమాను తక్కువ చేస్తూ.. ‘జైలర్ 2’కి పోదాం అనే రీల్స్ కనిపిస్తాయని చెప్పాడు. సోషల్ మీడియా ప్రమోషన్, ట్రోలింగ్ గురించి అన్నీ తెలిసినోడిలా మాట్లాడాడు విజయ్.
Vijay Deverakonda, Rashmika
దీంతో విజయ్ దేవరకొండకు అన్యాయం జరిగిపోబోతోంది అంటూ తెలుగు సినిమా అభిమానులు ఆందోళన కూడా చెందారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ భార్య, ప్రముఖ కథానాయిక రష్మిక మందన మాటలు వింటుంటే తెలుగు సోషల్ మీడియాలో అలాంటివేమీ కనిపించడం లేదు. మొత్తం సోషల్ మీడియా ‘రణబాలి’లోని శింగనమల బొబ్బి రణబాలి, జయమ్మ వీడియోలే కనిపిస్తున్నాయి. ఈ మాటను రష్మికనే చెప్పుకొచ్చింది.

‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక (Rashmika) మాట్లాడుతూ.. ‘‘ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే జయమ్మ, రణబాలి గెటప్పుల్లో కొన్ని వేల రీల్స్ కనిపిస్తున్నాయి. ఏమి అభిమానం చూపిస్తున్నారబ్బా..! మీ అభిమానం చూస్తుంటే ముద్దుగా ఉంది. అందుకు థ్యాంక్స్ చెబుతున్నా అని మురిసిపోయింది జయమ్మ ఉరఫ్ రష్మిక. ఒకవేళ విజయ్ చెప్పినట్లుగా అయితే ఈపాటికి సోషల్ మీడియా అంటే పెయిడ్ ప్రచారం, ఏఐ ప్రచారంలో ‘జైలర్ 2’ రీల్స్ నిండిపోయుండాలి.. రష్మికకు అవే రీల్స్ వచ్చి ఉండాలి.

అంటే.. టాలీవుడ్ ఫ్యాన్స్, నెటిజన్ల మీద ఆ రోజు విజయ్ ఓ ఇబ్బందికరమైన విమర్శ చేశాడు. తనను తాను బాధితుడిగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు. పోన్లెండి రష్మికకు ‘రణబాలి’ రీల్స్ వచ్చాయి కాబట్టి సరిపోయింది. లేదంటే చూశారా రష్మికకు ‘జైలర్ 2’ రీల్స్ వచ్చాయి.. నేను చెప్పిందే జరిగింది అనేవాడు. ఏదేమైనా తెలుగు ప్రేక్షకులు తోపబ్బా.. తమకు నచ్చిన సినిమాను చూస్తారు. నెటిజన్ల నెగిటివ్ ప్రచారం పట్టించుకోరు.
‘రాజాసాబ్’ రిజల్ట్పై నిర్మాత కామెంట్స్ వైరల్.. ఇలా కూడా అవుతుందా అంటూ..














