Rashmika: చికెన్‌ ముక్క కొరికి… కిర్రెక్కిస్తున్న ‘కిర్రాక్‌’భామ

సినిమా హీరోయిన్లు బ్రాండ్‌ అంబాసిడర్లుగా చేయడం పెద్ద విషయమేమీ కాదు. చాలా ఏళ్ల నుండి ఇది కొనసాగుతూనే ఉంది. సబ్బుల నుండి బర్గర్ల వరకు అన్నింటికీ బ్రాండింగ్‌ చేస్తున్నారు. అయితే దక్షిణాది నుండి ఇలా బ్రాండింగ్‌ చేసేవాళ్లు ఈ మధ్య కాలంలో పెరిగారు. యాడ్స్‌లో బాలీవుడ్‌ నటీమణులు చేస్తే అందరూ చూస్తారు.. సౌత్‌ భామలను అందుకే సంప్రదించరు అనుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మన నాయికలు కూడా యాడ్స్‌లో వస్తున్నారు. తాజాగా రష్మిక మందన అలాంటి ఒక బ్రాండింగ్‌ పట్టేసింది.

మెక్‌ డొనాల్డ్స్‌ ఫుడ్‌ ఛానల్‌ చాలా తక్కువగా సినిమా తారలను బ్రాండ్‌ అంబాసిడర్లు నియమిస్తూ ఉంటుంది. అందుకే ఆ యాడ్స్‌లో హీరో/హీరోయిన్లు పెద్దగా కనిపించరు. ఆ మధ్య ఎప్పుడో జూహీ చావ్లా కనిపించినట్లు గుర్తు. తర్వాత ఎవరు చేశారో పెద్దగా తెలియడం లేదు. అయితే తాజాగా సౌత్‌ స్టార్‌ రష్మిక మందనను తమ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మెక్‌డి ఎంచుకుంది. దీంతో దక్షిణాది మెక్‌డి యాడ్‌ చేస్తున్న తొలి నాయికగా రష్మిక నిలిచింది.

‘కిర్రాక్‌ పార్టీ’తో కన్నడలో కెరీర్‌ ప్రారంభించిన రష్మిక ‘గీత గోవిందం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఇచ్చి విజయం వెంటనే స్టార్‌ హీరోల పక్కన ఛాన్స్‌లు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు కోలీవుడ్‌, బాలీవుడ్‌వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి బ్రాండ్‌ అంబాసిడర్‌ అవకాశాలు దక్కించుకోవడం ఆమె కెరీర్‌కు ఉపయోగపడుతుంది కూడా. అన్నట్లు రష్మిక ఎంచక్కా చికెన్‌ తింటున్న ఆ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus